Okra Water: బెండకాయ నీటి వల్ల బరువే కాదు..ఈ ప్రయోజనాలు కూడా!

Okra Water: బెండకాయ నీరు షుగర్ నియంత్రణ నుంచి జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం, చర్మం వరకు అనేక ప్రయోజనాలు అందిస్తుంది.

Ramya Thota
Updated on: 11 May 2026 4:25 PM IST
Okra Water Benefits
X

Okra Water Benefits

బెండకాయ ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేస్తుంది.బెండకాయ నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా రక్తంలోని షుగర్‌ లెవల్స్‌ని అదుపులో ఉంచడంలో బాగా పనిచేస్తుంది.



ఉదయాన్నే పరగడపున బెండకాయ నీరు తాగడం వల్ల షుగర్‌ లెవల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.




బెండకాయంలో ఉండే జిగురు వంటి ద్రవం పేగుల గోడలను మృదువుగా చేసి ఆహారం సులభంగా కదిలేలా చేయడం ద్వారా మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.






బెండకాయ నీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ని తగ్గించి రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా కాపాడుతాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా బీపీని అదుపులోకి ఉంచి గుండెపై ఒత్తిడి తగ్గిస్తుంది.



బెండకాయ నీళ్లలో పుష్కలంగా ఉండే సీ విటమిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు రక్త శుద్ధికి దోహదపడి మొటిమలను తగ్గించి చర్మాన్ని సహజంగా కాంతివంతం చేస్తాయి. అలాగే ఇందులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇచ్చి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.




బెండకాయ నీళ్లలో ఉండే ఫైబర్‌ కంటెంట్‌ కడుపు నిండిని అనుభూతిని కలిగించి ఆకలి కోరికలను కంట్రోల్‌ చేస్తుంది. శరీరంలోని మెటబాలిజం రేటుని పెంచి, అనవసర కొవ్వును కరిగిస్తుంది.





Ramya Thota

Ramya Thota

రమ్య జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు.

Next Story