Photo Gallery: మైదానంలో మోదీ మ్యాజిక్.. సిక్కిం యువతతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని!

PM Modi: సిక్కిం 50వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ సందడి చేశారు. గ్యాంగ్‌టక్‌లో యువ క్రీడాకారులతో కలిసి ఫుట్‌బాల్ ఆడి ఉత్సాహపరిచారు.

Arun Chilukuri
Published on: 28 April 2026 11:42 AM IST
PM Modi
X

Photo Gallery: మైదానంలో మోదీ మ్యాజిక్.. సిక్కిం యువతతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని!

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ తన సిక్కిం పర్యటనలో సరికొత్త అవతారంలో కనిపించారు. సిక్కిం 50వ అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం ఉదయం ఆయన స్థానిక క్రీడాకారులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. స్పోర్ట్స్ దుస్తులు ధరించి మైదానంలో యువతతో కలిసి బంతిని తన్నుతూ ప్రధాని సందడి చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

యువ మిత్రులతో సరదాగా..

గ్యాంగ్‌టక్‌లో యువ మిత్రులతో కలిసి ఫుట్‌బాల్ ఆడడం తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని ప్రధాని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేయగా, అవి కాసేపట్లోనే నెట్టింట వైరల్‌గా మారాయి. దేశ ప్రధాని ఒక సామాన్యుడిలా పిల్లలతో కలిసి ఆటలో నిమగ్నమవ్వడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సిక్కిం భారత యూనియన్‌లో చేరి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన స్వర్ణోత్సవ ముగింపు వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురోగతికి ఊతమిచ్చేలా దాదాపు రూ.4,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం గ్యాంగ్‌టక్ వీధుల్లో నిర్వహించిన భారీ రోడ్ షోలో పాల్గొని ప్రజలకు అభివాదం చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story