Singer Suchitra: విజయ్-సంగీత విడిపోవడానికి త్రిషనే కారణం.. సుచిత్ర సంచలన ఆరోపణలు..
Singer Suchitra: సీఎం విజయ్ ప్రమాణ స్వీకార వేళ నటి త్రిషపై సింగర్ సుచిత్ర షాకింగ్ కామెంట్స్. విజయ్ తన భార్యాపిల్లలకు దూరం కావడానికి త్రిషనే కారణమంటూ సుచిత్ర చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెను దుమారం రేపుతున్నాయి.
Singer Suchitra: విజయ్-సంగీత విడిపోవడానికి త్రిషనే కారణం.. సుచిత్ర సంచలన ఆరోపణలు..
Singer Suchitra: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమై టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వేళ.. మరోవైపు సినీ ఇండస్ట్రీలో ఒక పాత వివాదం మళ్లీ రాజుకుంది. నటి త్రిషను టార్గెట్ చేస్తూ సింగర్ సుచిత్ర చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
నెహ్రూ స్టేడియంలో జరిగిన విజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందరినీ పలకరిస్తూ ఆమె సందడి చేసిన తీరు చూస్తుంటే.. "అచ్చం తన భర్త సీఎం అయితే ఒక భార్య ఎలా ప్రవర్తిస్తుందో త్రిష అలానే వ్యవహరించింది" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే వేడుకకు విజయ్ భార్య సంగీత, పిల్లలు దూరంగా ఉండటంపై చర్చ మొదలవ్వగా, సింగర్ సుచిత్ర చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి.
తాజా ఇంటర్వ్యూలో సుచిత్ర మాట్లాడుతూ త్రిషపై నిప్పులు చెరిగారు. "త్రిష ఒక పరాన్నజీవి, ఆమె అంటే నాకు అసహ్యం. విజయ్ చాలా గొప్ప వ్యక్తి, కానీ త్రిష వల్లే ఆయన తన భార్య సంగీతకు, పిల్లలకు దూరమయ్యారు. చివరకు తన తల్లిదండ్రులకు కూడా విజయ్ దగ్గర కాకుండా త్రిష అడ్డుపడుతోంది" అని సుచిత్ర సంచలన ఆరోపణలు చేశారు. విజయ్ బలహీనతలను త్రిష క్యాష్ చేసుకుంటోందని, ఆయన చుట్టూ తిరుగుతూ తనే లోకం అన్నట్లు భ్రమింపజేస్తోందని వ్యాఖ్యానించారు.
మరోవైపు తనపై వస్తున్న రూమర్లకు విజయ్ తనదైన శైలిలో చెక్ పెట్టారు. పాలనలో ఇతరుల జోక్యం ఉండబోదని, తానే 'పవర్ సెంటర్' అని స్పష్టం చేయడం ద్వారా త్రిషపై వస్తున్న వార్తలకు పరోక్షంగా సమాధానం ఇచ్చారు. అయితే, విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు త్రిష ఎమోషనల్ అవ్వడం, తన కోరిక నెరవేరిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం.
సుచిత్ర వ్యాఖ్యలపై త్రిష అభిమానులు, టీవీకే కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే సుచిత్ర ఇలాంటి నీచమైన ఆరోపణలు చేస్తోందని, ఇతరుల వ్యక్తిగత జీవితాలపై విషం చిమ్మడం మానుకోవాలని వారు చురకలు వేస్తున్నారు.




