Sobhita Dhulipala: రంగురంగుల చీరల్లో శోభిత అందాల సందడి.. ఫొటోలు వైరల్!

Sobhita Dhulipala: టాలీవుడ్ నటి శోభిత ధూళిపాళ 'ఆద్యం హ్యాండ్‌మేడ్'తో కలిసి 'బిలాంగింగ్' పేరుతో స్పెషల్ ఫొటోషూట్ చేశారు.

Arun Chilukuri
Published on: 25 Nov 2026 12:59 PM IST
Sobhita Dhulipala
X

Sobhita Dhulipala: రంగురంగుల చీరల్లో శోభిత అందాల సందడి.. ఫొటోలు వైరల్!

Sobhita Dhulipala: టాలీవుడ్ అందాల భామ శోభిత ధూళిపాళ తన విభిన్నమైన ఫ్యాషన్ సెన్స్‌తో మరోసారి అభిమానులను ఫిదా చేశారు. ఏ డ్రెస్ వేసినా తనదైన గ్రేస్, స్టైల్‌తో ఆకట్టుకునే శోభిత.. తాజాగా సంప్రదాయ చీరకట్టులో సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేశారు. ప్రముఖ హ్యాండ్లూమ్ బ్రాండ్ ‘ఆద్యం హ్యాండ్‌మేడ్’తో కలిసి ‘బిలాంగింగ్’ పేరుతో ఆమె చేసిన స్పెషల్ ఫొటోషూట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ఈ ప్రత్యేక ఫొటోషూట్‌లో శోభిత అచ్చం ఇంద్రధనుస్సులా విభిన్న రంగుల చీరల్లో మెరిసిపోయారు. క్రీమ్, గ్రీన్, పర్పుల్, మల్టీకలర్ ఇలా ఒక్కో చీరలో ఒక్కో రకమైన రాయల్ లుక్‌లో కనిపిస్తూ కనువిందు చేశారు. చేనేత చీరల గొప్పతనాన్ని చాటిచెబుతూనే, మోడ్రన్ స్టైలింగ్‌తో ఆమె ఇచ్చిన పోజులు చూడగానే ఆకట్టుకునేలా ఉన్నాయి.

సంప్రదాయానికి, ఆధునికతకు చక్కటి మేళవింపుగా ఉన్న శోభిత కొత్త ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. "చీర కట్టినా శోభిత స్టైల్ మాత్రం వేరే లెవల్" అంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.