Health:ఈ రసంతో కిడ్నీ, లివర్ క్లీనింగ్‌తో పాటు ఈ 5 ప్రయోజనాలు కూడా!
Health:చెరుకు రసం వేసవిలో శక్తి, చల్లదనం ఇచ్చే సహజ పానీయం. ఇది జీర్ణక్రియ, కిడ్నీ, లివర్, చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
sugarcane juice benefits
ప్రకృతి ప్రసాదించిన వరప్రసాదం ఈ చెరుకు రసం.తడి ఆరిన గొంతుకులకు ఊపిరి పోసే అమృత ధార ఈ చెరుకు రసం. వేసవి ఎండల వేడికి మాడిపోతున్న మనుషులకు చల్లని ఊరట ఇచ్చే పానీయం.
ఖరీదైన కూల్‌డ్రింక్స్ ఇవ్వలేని స్వచ్ఛత, ఆరోగ్యం మట్టి నుంచి వచ్చిన ఈ చెరుకు గడల సొంతం. శరీరంలోని అలసటను తరిమికొట్టి మనసుకు హాయినిచ్చే సహజ సిద్ధమైన ఎనర్జీ డ్రింక్.
చెరుకు రసం లివర్‌కి మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. ముఖ్యంగా కామెర్లు వ్యాధి ఉన్న వారికి ఇది ఒక దివ్య ఔషధం.
చెరుకు రసం మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది. ఇది మూత్రపిండాల్లోని రాళ్లను తొలగించడానికి, మూత్రనాళ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సహాయపడుతుంది.
కిడ్నీల పనితీరును మెరుగుపరచడమే కాకుండా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కడుపులో మంట, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి చెరుకు రసం చాలా మేలు చేస్తుంది. అలాగే కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది.
చెరుకు రసంలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ మొటిమలను తగ్గించి చర్మం మెరిసేలా చేస్తాయి. ఇది వృద్ధాప్య ఛాయలను తగ్గించి యవ్వనంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
చెరుకు రసంలో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇది దంతాల ఎనామిల్‌ను బలోపేతం చేసి పళ్లు పుచ్చిపోకుండా కాపాడుతాయి.




