Vadapalli: వాడపల్లిలో వైభవంగా 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు
Vadapalli: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి 14వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సరస్వతీ అలంకారంలో హంస వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు.
Vadapalli: వాడపల్లిలో వైభవంగా 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు
Vadapalli: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు రెండో రోజు శుక్రవారం (ఆశ్వయుజ బహుళ పంచమి) ఘనంగా నిర్వహించారు. ఆలయంలో వేద మంత్రోచ్ఛారణలు, విశేష పూజలు, హోమాది కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఉదయం 9.15 గంటలకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పంచామృత మండప ఆరాధన, ప్రధాన హోమాలు నిర్వహించారు. అనంతరం శోభాయాత్రగా గోదావరి నదికి చేరుకుని పవిత్ర జలాలను సేకరించారు. తదుపరి స్వామివారికి స్నపనం, లక్ష కుంకుమార్చన, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
సాయంత్రం 5.30 గంటలకు స్వస్తివాచనం, ప్రధాన హోమాలు, మహాలక్ష్మీ మంత్రపూర్వక మహాలక్ష్మీ హోమం, దిగ్దేవతా బలిహరణ తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
రాత్రి 7.30 గంటలకు సరస్వతీ అలంకరణలో శ్రీ స్వామివారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. హంస వాహనంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల గోవింద నామస్మరణలతో వాడపల్లి క్షేత్రం మార్మోగింది.




