Razole: రాజోలు నియోజకవర్గంలో తొలిరోజు 16 ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు!
Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో తొలిరోజు 16 ఎంపీటీసీ నామినేషన్లు దాఖలయ్యాయి.
Razole: రాజోలు నియోజకవర్గంలో తొలిరోజు 16 ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు!
Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. మామిడికుదురు మండలంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆరుగురు, జనసేన పార్టీ నుంచి ఒకరు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) నుంచి ఒకరు చొప్పున మొత్తం ఎనిమిది నామినేషన్లు వేశారు.
రాజోలు మండలంలో జనసేన పార్టీ నుంచి ఒకరు, వైకాపా నుంచి ఇద్దరు అభ్యర్థులు మొత్తం మూడు నామినేషన్లు దాఖలు చేశారు. మలికిపురం మండలంలో కూటమి తరఫున ఒకరు, వైకాపా నుంచి ఒకరు చొప్పున ఇద్దరు నామినేషన్లు వేశారు.
సఖినేటిపల్లి మండలంలో వైకాపా నుంచి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీగా నామినేషన్ల సంఖ్య: మామిడికుదురు – 8, రాజోలు – 3, మలికిపురం – 2, సఖినేటిపల్లి – 3. మొత్తం – 16 నామినేషన్లు




