Vadapalli: కోనసీమ తిరుమల వాడపల్లిలో వైభవంగా 3వ రోజు బ్రహ్మోత్సవాలు

Vadapalli: కోనసీమ తిరుమల వాడపల్లిలో 14వ బ్రహ్మోత్సవాల 3వ రోజు స్వామివారు హనుమద్వాహనంపై కోదండరాముడి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 31 Oct 2026 10:48 PM IST
Vadapalli
X

Vadapalli: కోనసీమ తిరుమల వాడపల్లిలో వైభవంగా 3వ రోజు బ్రహ్మోత్సవాలు

Vadapalli: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 14వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు కార్యక్రమాలు శనివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.

ఆశ్వయుజ బహుళ షష్టి సందర్భంగా ఉదయం 8.45 గంటలకు సంకల్పం, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సప్తకలశారాధన, అభిషేకం, ప్రధాన హోమాలు, దిగ్దేవతా బలిహరణ, మహాపుష్పయాగం తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

సాయంత్రం 5.30 గంటలకు స్వస్తి వాచనం, ప్రధాన హోమాలు, సహస్ర దీపాలంకరణ సేవ, దిగ్దేవతా బలిహరణ, విశేషార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

రాత్రి 7.30 గంటలకు కోదండరామ అలంకరణలో శ్రీ స్వామివారు హనుమద్వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. హనుమద్వాహన సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA