Ainavilli: వినాయక చవితి ఉత్సవాలు.. పటిష్ట భద్రతతో సీఐ భీమరాజు!

Ainavilli: ప్రసిద్ధ అయినవిల్లి వినాయకుని చవితి ఉత్సవాలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు సీఐ భీమరాజు వెల్లడి. ట్రాఫిక్, పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి.

RAJU, P GANNAVARAM
Published on: 13 Sept 2026 12:29 PM IST
Ainavilli
X

Ainavilli: వినాయక చవితి ఉత్సవాలు.. పటిష్ట భద్రతతో సీఐ భీమరాజు!

Ainavilli: రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శ్రీ అయినవిల్లి వినాయక స్వామి వారి వినాయక చవితి ఉత్సవాలు ఈ నెల 14వ తేదీ నుండి అత్యంత అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం శాంతిభద్రతల పరిరక్షణ కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ భీమరాజు తెలిపారు.

​అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ‌ రాహుల్ మీనా ఆదేశాల మేరకు, కొత్తపేట సబ్ డివిజన్ డీయస్పీ సుంకర మురళీ మోహన్ పర్యవేక్షణలో ఈ బందోబస్తు ఏర్పాట్లు చేపడుతున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత ఎక్కువ మంది పోలీసు సిబ్బందితో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

అయినవిల్లిలో పార్కింగ్ సమస్యను అధిగమించడానికి నూతనంగా స్థలాలను గుర్తించి, జేసీబీలతో సమాయత్తం చేశారన్నారు. ​చాలామంది భక్తులు ఇళ్ల వద్ద పూజలు ముగించుకుని మధ్యాహ్నం 11, 12 గంటల దాటిన తర్వాత ఒక్కసారిగా రావడం వల్ల విపరీతమైన రద్దీ ఏర్పడుతోందని, కాబట్టి భక్తులు ఉదయం నుంచే వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని సీఐ విజ్ఞప్తి చేసారు.

ముఖ్యంగా మహిళా భక్తుల రక్షణ కోసం ప్రత్యేకంగా మహిళా పోలీసులను బందోబస్తు విధుల కోసం వినియోగిస్తున్నామని, భక్తులందరూ ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఐ మీడియా సమావేశంలో వెల్లడించారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM