Alamuru: ఆలమూరులో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన డీఎల్‌డీఓ
Alamuru: ఆలమూరు సిద్ధార్థ స్కూల్‌లో ఓటింగ్ సామగ్రి పంపిణీని తనిఖీ చేసిన డీఎల్‌డీఓ కే. సురేష్ కుమార్. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశాలు.
Alamuru: ఆలమూరులో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన డీఎల్‌డీఓ
ఆలమూరు: ఆలమూరు మండలంలోని 18 గ్రామాల్లో గురువారం నిర్వహించబోయే జడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికలను అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు అధికారి (డీఎల్‌డీఓ) కే. సురేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
ఆర్వో లక్ష్మీ ప్రత్యూష, ఏఆర్వోలు ఎంపీడీఓ ఏ. రాజు, తహసిల్దార్ కే. కుశరాజుల ఆధ్వర్యంలో మండల కేంద్రమైన సిద్ధార్థ స్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు మరియు ఇతర ఎన్నికల సామగ్రిని ఇక్కడి నుంచే పకడ్బందీగా పంపిణీ చేయాలని సూచించారు.అదేవిధంగా ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సులను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలించాలన్నారు.
అలాగే పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని తరలించే సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని అధికారులను అప్రమత్తం చేశారు. సిబ్బంది అంతా సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని డీఎల్‌డీఓ సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు బి అప్పాజీ, ఎన్ రాజు,పలువురు ఎన్నికల సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.




