Alamuru: ఆది వరాహ స్వామి రూపంలో దర్శనమిచ్చిన ఆలమూరు జనార్దనుడు!
Alamuru: ఆలమూరు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి వారు ఆది వరాహ స్వామి రూపంలో దర్శనం. వెల్లువలా తరలివచ్చిన భక్తులు, అన్నప్రసాద వితరణ.
Alamuru: ఆది వరాహ స్వామి రూపంలో దర్శనమిచ్చిన ఆలమూరు జనార్దనుడు!
Alamuru: నారద మహర్షి ప్రతిష్ఠిత నవ జనార్ధన ఆలయాల్లో నాలుగవ క్షేత్రమైన ఆలమూరు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి వారు శనివారం ఆది వరాహ స్వామి రూపంలో దర్శనమిచ్చారు. హిరణ్యాక్షుణ్ణి వధించి వేదాలను రక్షించి భూమిని ఉద్ధరించిన స్వామి వారి దివ్య లీలను ప్రదర్శిస్తూ జనార్దస్వామి భక్తులకు దర్శనం ఇవ్వడంతో ఆలయ ప్రాంగణమంతా భక్తజనపారవశ్యంతో పులకించిపోయింది. దూర ప్రాంతాల నుంచి వెల్లువలా తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది.
స్వామి వారి దర్శనానికి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో నరేంద్ర కుమార్, ఆలయ చైర్మన్ బైరిశెట్టి రాంబాబు, సభ్యులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. సేవా సిబ్బంది భక్తుల క్యూ లైన్ లను సమర్ధంగా నిర్వహించడం, ప్రసాద వితరణ, అన్న ప్రసాద వితరణ మొదలైన కార్యక్రమాల్లో తమ సేవలను అందజేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం అందజేశారు. జయ జనార్దన గోవిందా... వరాహ రూపాయ గోవిందా... ఆపద్బాంధవ జనార్దనా అన్న నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగిపోయాయి.




