Alamuru: ఆలమూరు మండలంలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి తమ్మన శ్రీనివాస్ జోరుగా ప్రచారం!

Alamuru: ఆలమూరు మండలంలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి తమ్మన శ్రీనివాస్ జోరుగా ప్రచారం. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి.

TRIMURTULU, KOTHAPETA
Published on: 26 Oct 2026 3:25 PM IST
Alamuru
X

Alamuru: ఆలమూరు మండలంలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి తమ్మన శ్రీనివాస్ జోరుగా ప్రచారం!

Alamuru: ఆలమూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్, చెముడు లంక మాజీ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం అన్ని గ్రామాల్లో దూసుకుపోతోంది, కొత్తపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆశీస్సులతో, ఆయన బలపరిచిన ఏకైక జడ్పీటీసీ అభ్యర్థిగా తమ్మన శ్రీనివాస్ మండలంలోని ప్రతి గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. చిర్ల జగ్గిరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, ఆయన చూపిన నాయకత్వం పట్ల ప్రజల్లో ఉన్న అభిమానమే తమ్మన శ్రీనివాస్ కు అపూర్వ స్పందనగా మారుతోంది.చెముడులంక కే పరిమితం కాకుండా మండలంలోని అన్ని గ్రామాల్లో తమ్మన శ్రీనివాస్ స్వయంగా గడప గడపకు తిరుగుతూ, చిర్ల జగ్గిరెడ్డి సేవా స్ఫూర్తితో తాను కూడా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని, పిలిస్తే పలికే వ్యక్తిగా సేవ చేస్తానని ప్రజలకు హామీ ఇస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, చిర్ల జగ్గిరెడ్డి హయాంలో ఆలమూరు మండలంలో జరిగిన రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పథకాలు వంటి అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు.చిర్ల జగ్గిరెడ్డి వెన్నుదండగా ఉండగా, సేవా తత్పరుడైన తమ్మన శ్రీనివాస్ జడ్పీటీసీగా గెలిస్తేనే ఆలమూరు మండలం మరింత అభివృద్ధి చెందుతుందని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సైతం బలంగా కోరుకుంటూ మద్దతు తెలుపుతున్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA