Mukunuru: ముకునూరులో కూటమి శక్తి ఒక్కటైంది.. నాగరాజుకు జమాల్ ఖాన్ మద్దతు!

Mukunuru: చింతూరు మండలం ముకునూరు సర్పంచ్ అభ్యర్థి పాయం నాగరాజుకు టీడీపీ మండల అధ్యక్షుడు జమాల్ ఖాన్ ఆదివారం పూర్తి మద్దతు ప్రకటించారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 22 Nov 2026 2:46 PM IST
Mukunuru
X

Mukunuru: ముకునూరులో కూటమి శక్తి ఒక్కటైంది.. నాగరాజుకు జమాల్ ఖాన్ మద్దతు!

చింతూరు: చింతూరు మండలం ముకునూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు అందరి చూపు ఒక్క వ్యక్తిపైనే ఉంది. ఆయనే జనసేన పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన పాయం నాగరాజు. కేవలం 28 సంవత్సరాల వయసులో, రాజకీయ అరంగేట్రం చేసి సర్పంచ్‌గా పోటీ చేయడం గ్రామంలో పెద్ద చర్చగా మారింది.ఈ ఎన్నికల్లో నాగరాజుకు అత్యంత కీలకమైన బలం తోడైంది.

తెలుగుదేశం మండల అధ్యక్షులు జమాల్ ఖాన్ తన పూర్తి మద్దతును నాగరాజుకు ప్రకటించారు. కూటమి ఐక్యతకు ఇదే నిదర్శనమని, జనసేన, తెలుగుదేశం శ్రేణులు భుజం భుజం కలిపి పనిచేస్తాయని జమాల్ ఖాన్ స్పష్టం చేశారు. ఆయన మద్దతుతో నాగరాజు విజయంపై ఆశలు మరింత చిగురించాయి.నాగరాజు అంటేనే గ్రామంలో ఒక ప్రత్యేక ముద్ర.

యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి ప్రవర్తన కలిగినవాడు. పెద్దలను గౌరవించే సంస్కారం, యువతతో మమేకమయ్యే చొరవ, గ్రామ అభివృద్ధిపై స్పష్టమైన దృష్టి ఆయనకు అందరి ఆదరణ తెచ్చాయి. “మా గ్రామానికి యువ నాయకుడు కావాలి, నాగరాజు అయితేనే మార్పు వస్తుంది” అని స్థానికులు అంటున్నారు.ప్రచారంలో కూడా నాగరాజు దూసుకుపోతున్నారు.

ఇంటింటికీ వెళ్లి, ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, సమస్యలు వింటూ, పరిష్కారానికి హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. జమాల్ ఖాన్ నాయకత్వంలో కూటమి కార్యకర్తలు గ్రామమంతా ఒక్క తాటిపైకి వచ్చి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముకునూరులో ఈసారి వయసు కాదు, విజన్ గెలుస్తుందని గ్రామస్తులు అంటున్నారు. 28 ఏళ్ల యువకుడి గెలుపు, గ్రామ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని స్థానికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR