Kadiyam: హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో సర్వైకల్ క్యాన్సర్‌కు చెక్: డాక్టర్ రవి రామ్ కిరణ్
Kadiyam: సరైన వయసులో హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించవచ్చని కడియంలో డాక్టర్ గోరంట్ల రవి రామ్ కిరణ్ పేర్కొన్నారు.
Kadiyam: హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో సర్వైకల్ క్యాన్సర్‌కు చెక్: డాక్టర్ రవి రామ్ కిరణ్
కడియం: సరైన వయసులో హెచ్ పి వి వాక్సిన్ తీసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని టిడిపి ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవి రామ్ కిరణ్ అన్నారు.
కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థుల్లో హెచ్ పి వి వ్యాక్సినేషన్‌పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
ఈకార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, మండల టిడిపి అధ్యక్షులు వెలుగుబంటి నాని పాల్గొన్నారు.
ఈ సందర్బంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ హెచ్ పి వి ఒక వైరస్ అని, ఇందులో అనేక రకాల స్ట్రెయిన్లు ఉన్నాయని తెలిపారు. ఇతర అనేక క్యాన్సర్లతో పోలిస్తే సర్వైకల్ క్యాన్సర్‌ను వ్యాక్సినేషన్ ద్వారా నివారించగలిగే క్యాన్సర్ అని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు తల్లిదండ్రులు, వైద్యుల సూచనతో వ్యాక్సిన్‌పై అవగాహన పొందాలని సూచించారు.
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్‌సీలు, సబ్-సెంటర్లలో అందుబాటులో ఉన్న హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమాలను వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం నివారణ, అవగాహన రెండూ ఎంతో ముఖ్యమని రవిరామ్ కిరణ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్, పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.




