Etapaka: ఎటపాక మండలంలో రోడ్డు ప్రమాదం.. టెంపుల్ ఇన్‌స్పెక్టర్ మృతి

Etapaka: అల్లూరి జిల్లా ఎటపాక మండలం నెల్లిపాకలో సీఆర్పీఎఫ్ వ్యాన్ ఢీకొని భద్రాచలం రామాలయం టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రామిరెడ్డి మృతి. భద్రాచలం ఆసుపత్రికి తరలింపు.

P. LAXMIKANTH REDDY, ALAMPOOR
Published on: 24 July 2026 7:54 PM IST
Etapaka
X

Etapaka: ఎటపాక మండలంలో రోడ్డు ప్రమాదం.. టెంపుల్ ఇన్‌స్పెక్టర్ మృతి

ఎటపాక: పోలవరం జిల్లా ఎటపాక మండలం నెల్లిపాకలో రోడ్డు ప్రమాదం భద్రాచలం నుండి కుంటకు సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో రామాలయం టెంపుల్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామిరెడ్డి నెల్లిపాక గ్రామంలో నివాసం ఉంటున్నాడు. సాయంత్రం 6 గంటలకు రామాలయంలో విధులకు బయలు దరగా ఈ సంఘటన జరిగిందని ఆలయ ఉద్యోగులు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా రామిరెడ్డి విధి నిర్వహణలో నిజాయితీగా పనిచేశాడని తెలిపారు.

P. LAXMIKANTH REDDY, ALAMPOOR

P. LAXMIKANTH REDDY, ALAMPOOR

Next Story