Amalapuram: బాలయోగి స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ యోగా వేడుకలు
Amalapuram: అమలాపురం బాలయోగి స్టేడియంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
Amalapuram: బాలయోగి స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ యోగా వేడుకలు
అమలాపురం: మానవ జీవితంలో సర్వ రోగ నివారిణి యోగా జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్.స్థానిక జి.ఎమ్.సి. బాలయోగి స్టేడియంలో జిల్లాస్థాయి యోగా దినోత్సవంలో పాల్గొన్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్.వయస్సుతో సంబంధం లేకుండా యోగా సాధన చేస్తే సత్ఫలితాలు వస్తాయి కలెక్టర్ మహేష్ కుమార్.యోగా సాధనతోనే మానసిక, శారీరక ఆరోగ్యం సాధ్యం జిల్లా కలెక్టర్.
మన సంస్కృతి,విలువలే భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వగురువుగా నిలిపాయి కలెక్టర్.చిన్నారుల నుండి గర్భిణీలు, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ యోగా ఎంతో ఉపయోగకరం కలెక్టర్ మహేష్ కుమార్.
రోజువారీ యోగాతో డయాబెటిస్, బీపీ,గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించవచ్చు కలెక్టర్.వ్యాధుల నివారణ, ముందస్తు ఆరోగ్య పరిరక్షణే 'యోగాంధ్ర' ప్రధాన లక్ష్యం: జాయింట్ కలెక్టర్ వైఖోo నైదియాదేవి.నిత్య యోగాభ్యాసం ద్వా రానాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు జాయింట్ కలెక్టర్.
యోగాతో ఏకాగ్రత,ఆత్మవిశ్వాసం పెరిగి తక్కువ సమయంలో ఎక్కువ పని చేయవచ్చు జేసీ వైఖోo నైదియాదేవి.పిల్లలు చిన్న వయస్సు నుంచే యోగా అలవాటు చేసుకుంటే చదువులో మెరుగైన ఫలితాలు సాధిస్తారు జేసీ.నెల రోజుల పాటు క్రమం తప్పకుండా యోగా చేస్తే సానుకూల ఫలితాలను స్పష్టంగా గమనించవచ్చు జాయింట్ కలెక్టర్.ప్రపంచానికి భారతదేశం అందించిన అమూల్యమైన కానుక యోగా జేసీ వైఖోo నైదియాదేవి.
రోజుకు కనీసం అరగంట యోగాకు కేటాయిస్తే ఒత్తిడి, ఆందోళనలను అధిగమించవచ్చు డిఆర్ఓ వి. సుబ్బారావు.నేటి యువతలో పెరుగుతున్న ఒత్తిడిని ఎదుర్కోవడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది డిఆర్ఓ సుబ్బారావు.




