Amalapuram: విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసిని ప్రైవేట్‌పరం చేయొద్దు
Amalapuram: విద్యుత్ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రైవేట్ పినాకిల్ సంస్థకు అప్పగించొద్దని అమలాపురంలో సీఐటీయూ డిమాండ్. కరపత్రాల ఆవిష్కరణ, నిరసన.
Amalapuram: విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసిని ప్రైవేట్‌పరం చేయొద్దు
అమలాపురం: అమలాపురం ఆర్టీసీ బస్టాండ్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో విద్యుత్ బస్సులు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పినాకిల్ సంస్థకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ కరపత్రాన్ని ముద్రించి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.దుర్గాప్రసాద్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కారేo వెంకటేశ్వరరావు మాట్లాడుతూ
ఏపిఎస్ ఆర్టీసి ఆసియా లోనే అతిపెద్ద ప్రభుత్వ రవాణా సంస్థ. రాష్ట్రంలోని అత్యధిక గ్రామాలతో సహా ప్రజలకు గత 75 సంవత్సరంల నుంచి సేవలందిస్తున్నది అన్నారు.ప్రతి రోజు 48 లక్షల మంది ప్రజలు ప్రయాణి స్తున్నారు.మన రాష్ట్రంలో స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం ఉంది.విద్యార్థులు, వృద్ధులు,వికాలాంగులకు రాయితీలతో సేవలందిస్తుంది. విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్రచేస్తున్నది.విద్యుత్, మున్సిపాల్టీలతో సహా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.
ఇటీవల ఆర్టీసి యాజమాన్యం కార్మికుల కొన్ని పెండింగ్ సమస్యలు పరిష్కరించడం సంతోషకరం. కాని ప్రమాదకరమైన 'ప్రైవేటు పినాకిల్' సంస్థ ఒప్పందంపై ఏమాత్రం స్పందించలేదు.రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత పేరుతో తప్పుకున్నారు.ఆర్టీసి వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరుకాదు. కార్మికులను మోసం చేయడానికి చేసిన ప్రయత్నం తప్ప మరోటి కాదని అన్నారు.ఆర్టీసి ని ప్రైవేటీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 2024 లోని పూనే కి చెందిన పినాకిల్ సంస్థతో ఒప్పందం చేశారు.దీనిని అమలుచేయడానికి చర్యలు ఇటీవల వేగవంతం చేశారు.
4 డిపోలు ఖాళిచేయించారు.మరో 8 డిపోలను ఖాళీ చేయడానికి సిద్ధంచేస్తున్నారు.750 విద్యుత్ బస్సులను ప్రైవేట్ వారికి అప్పగిస్తున్నారు.మరో 300 బస్సులకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.ఈ బస్సులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి బస్సుకు రూ.40 లక్షల చొప్పున ఉచిత సబ్సీడీ ఇప్పిస్తున్నారు. పినాకిల్ ఒప్పందంలో ప్రతి కిలోమీటర్కు రూ.72.55 /-లు చెల్లించడానికి ఒప్పందం కుదిరింది.
మనకు ప్రస్తుతం వస్తున్న ఆదాయం కిలో మీటర్కు రూ.40/-ల లోపే. మిగిలిన డబ్బులు ఎక్కడి నుండి చెల్లిస్తారు ఆర్టీసీని నష్టాల్లో నెట్టడానికి ఈ ఒప్పందం కీలకం. స్త్రీ శక్తి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1680/-ల కోట్లకు పైగా ఆర్టీసీకి బకాయిలు ఉన్నాయి.ఈ డబ్బులతో కొత్త బస్సులు ఎందుకు ఆర్టీసి కొనడంలేదు.ఆర్టీసీని ప్రైవేట్కు ఇవ్వాలనే లక్ష్యంతోనే అనేక సంవత్సరంల నుంచి ఆర్టీసిలోని 12 వేల ఖాళీలను నింపడంలేదు అన్నారు.విద్యుత్ బస్సులకు మేము వ్యతిరేకం కాదని.
కానీ విద్యుత్ బస్సులు పేరుతో ఆర్టీసీను పూర్తిగా ముంచడానికి మేమే వ్యతిరేకం అని అన్నారు. ఆర్టీసీ రాష్ట్రంలో 1950 ఎకరాల భూములు ఉన్నాయి అన్ని జిల్లాల్లోనూ నగరాల్లోనూ నడిబొడ్డులో ఆర్టీసీ డిపోలో వర్క్ షాప్ లు,బస్టాండ్లు లను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం అన్యాయం అన్నారు.ఈ విలువైన స్థలాలు ప్రైవేట్ కు ఇస్తే పాలకులు కోట్ల రూపాయలు కమిస్ సన్లు వస్తాయని విమర్శించారు. ఆర్టీసీని వదిలిoచుకుంటే శక్తితో సహా ఇప్పుడున్న రాయితీలు అన్ని ఎగిరిపోతాయని అన్నారు.అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ కుట్ర చేస్తున్నది.
ఏపీఎస్ఆర్టీసీకి గతంలో ఎన్నడూ లేని ప్రమాదం ఇప్పుడు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చెందారు.దీనికి ట్రేడ్ యూనియన్లు,కార్మికులు గుర్తించకపోతే తీవ్ర నష్టానికి గురవుతారని అన్నారు.ఈ ప్రమాదం నుంచి మేలుకోవాలి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజాసంఘాలను కలుపుకుని పోరాటం నిర్వహిస్తామని తెలియజేశారు.కరపత్రాలు పంచిన వారిలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు నాగ వరలక్ష్మి,బండి సతీష్ కుమార్, దామిశెట్టి ఆదికృష్ణ తదితరులు పాల్గొన్నారు.




