Amalapuram: అమలాపురంలో 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ప్రారంభం!
Amalapuram: కోనసీమ జిల్లాలో 5 నూతన 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించిన కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఎమ్మెల్యే ఆనందరావు.
Amalapuram: అమలాపురంలో 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ప్రారంభం!
Amalapuram: ప్రసూతి తల్లులు మరియు నవజాత శిశువులకు ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఆర్. మహేష్ కుమార్ తెలిపారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్ కలెక్టర్ ప్రాంగణం నందు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా,అమలాపురం స్థానిక శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు తో కలిసి జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఆధ్వర్యంలో వేదావిద్య ఫౌండేషన్ మరియు శ్రీనివాస టూర్ ట్రావెల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ప్రసూతి తల్లులు మరియు నవజాత శిశువులకు 102 తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రసూతి తల్లులు మరియు నవజాత శిశువులకు 102 తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాల వసతులు, పనితీరు, వాహనదారుడు వివరాలు, పలు రకాల సర్వీసులు వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏరియా ఆసుపత్రులకు 300 ప్రసూతి తల్లులు మరియు నవజాత శిశువులకు 102 తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలు ప్రారంభించడం జరిగిందని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన 102 తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ఐదు వాహనాలు మంజూరు చేయడం జరిగిందని, వాటిలో అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికు రెండు వాహనాలు,రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రికి రెండు వాహనాలు పి.గన్నవరం సి.హెచ్. సి కి ఒక వాహనము పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలియజేశారు.
గర్భిణీలు,బాలింతలు మరియు శిశువులకు అవసరమైన ఆరోగ్య సేవలు సకాలంలో అందేలా రవాణా సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే గర్భిణీలు,తల్లులు,చిన్నారులకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.ఆరోగ్య శాఖ అధికారులు,సిబ్బంది సమన్వయంతో ఈ వాహన సేవలను సమర్థవంతంగా నిర్వహించి,అర్హులైన వారికి సకాలంలో సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కార్తీక్,డిపిఎంఓ డా.టీకే శ్రీనివాసరావు ముమ్మిడివరం సిహెచ్సి గైనకాలజిస్ట్ డా.జీవివి సత్య కుమార్,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




