Amalapuram: అమలాపురం అకాల వర్షాల నేపథ్యంలో కలెక్టర్ కీలక ఆదేశాలు

Amalapuram: కోనసీమ జిల్లాలో అకాల వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు.

PRABHU, RAZOLE
Published on: 3 May 2026 3:27 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురం అకాల వర్షాల నేపథ్యంలో కలెక్టర్ కీలక ఆదేశాలు

Amalapuram: జిల్లా రైతాంగం ఆరుగాలం శ్రమించి,కష్టపడి పండించిన ప్రతి గింజను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని, అకాల వర్షాల పట్ల అజాగ్రత్త వహించకుండా అధికార యంత్రాంగం ఇచ్చే సూచనలను రైతులు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. రానున్న మూడు రోజులు అకాల వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉంటూ రైతులు తమ ఉత్పత్తులను కాపాడుకోవాలన్నారు.

రానున్న మూడు రోజుల పాటు జిల్లాలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు, యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆదివారం ఉదయం సివిల్ సప్లై అధికారులు, వ్యవసాయశాఖ మరియు తాహసిల్దార్లు తో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌ లో జిల్లా కలెక్టర్ కీలక సూచనలు,ఆదేశాలు జారీ చేశారు.రైతులు పండించిన ధాన్యం వర్షానికి తడిచి పోకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

వాటిలో ప్రధానంగా వరి కోతలపై వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే కోతలు ప్రారంభించని రైతులు, వాతావరణం కుదుటపడే వరకు అంటే వచ్చే మూడు రోజుల పాటు కోతలను వాయిదా వేసుకోవడం ఎంతో శ్రేయస్కరమన్నారు.ఇప్పటికే కోతలు పూర్తయిన ప్రాంతాల్లో ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు లేదా గోడౌన్లకు తరలించాలన్నారు. ప్రతి ధాన్యం సేకరణ కేంద్రంలోనూ సరిపడా టార్పాలిన్ బరకాలు అందుబాటులో ఉంచడం జరిగిందని, రైతులు తమ ధాన్యం తడవకుండా వీటిని వినియోగించుకోవాలని కోరారు.

వ్యవసాయ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి, రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు అందించాలన్నారు. వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. సహాయం కోసం మరియు పంట రక్షణ విషయంలో ఏవైనా సందేహాలున్నా లేదా అత్యవసర సహాయం కావాలన్నా రైతులు వెంటనే తమ సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

రైతు కష్టపడి పండించిన ప్రతి గింజను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని, అకాల వర్షాల పట్ల అజాగ్రత్త వహించకుండా, అధికార యంత్రాంగం ఇచ్చే సూచనలను రైతులు తప్పనిసరిగా పాటించి తమ ఉత్పత్తులను కాపాడుకొని దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముకోకుండా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరలు పొందాలన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story