Amalapuram: నీటిపారుదల వనరుల ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టి కలెక్టర్
Amalapuram: అమలాపురం చెరువులు, కాలువల ఆక్రమణలను గుర్తించి తొలగించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్.
Amalapuram: నీటిపారుదల వనరుల ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టి కలెక్టర్
అమలాపురం: నీటిపారుదల వనరుల ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టి జిల్లా కలెక్టర్ డా.ఆర్. మహేష్ కుమార్. జిల్లా,డివిజన్, మండల స్థాయి ఇరిగేషన్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష.నీటిపారుదల వనరుల ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
బుధవారం కలెక్టరేట్ నుండి టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో డివిజన్,మండల స్థాయి ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని కాలువలు,చెరువులు, డ్రైన్లు, ఇతర నీటిపారుదల వనరులపై జరిగిన ఆక్రమణలను గుర్తించి నిబంధనల మేరకు తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ప్రతి మండలంలో కాలువలు, చెరువులు, హెడ్‌వర్క్స్ వారీగా ఆక్రమణల పూర్తి వివరాలను నమోదు చేసి ప్రత్యేక రిజిస్టర్లు సిద్ధం చేయాలని సూచించారు.
గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో గుర్తించిన ఆక్రమణలపై రెవెన్యూ,ఇరిగేషన్,సర్వే శాఖలు సమన్వయంతో పనిచేసి ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలని ఆదేశించారు.రిజిస్టర్లపై సంబంధిత వీఆర్‌వోలు, తహసీల్దార్లు,ఇరిగేషన్ అధికారులు,వాటర్ యూజర్స్ అసోసియేషన్ అధ్యక్షుల ధృవీకరణ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.
అనంతరం భౌతిక పరిశీలన నిర్వహించి నిబంధనల ప్రకారం ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి,డి ఆర్ ఓ వి సుబ్బారావు,ఇరిగేషన్ ఎఈ శ్రీనివాసరావు,జిల్లా అధికారులు, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




