Amalapuram: అమలాపురం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ 254 వినతుల స్వీకరణ!
Amalapuram: అమలాపురం కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ ప్రజల నుంచి 254 వినతులు స్వీకరించి, అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
Amalapuram: అమలాపురం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ 254 వినతుల స్వీకరణ!
Amalapuram: ప్రజల నుంచి అందుతున్న అర్జీలను పూర్తి పారదర్శకతతో, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పరిష్కరించాలని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో కలెక్టర్ ప్రజల నుంచి 254 వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ, ఇరిగేషన్, హోం, వైద్య ఆరోగ్య, పంచాయతీ, డీఆర్‌డీఏ, సివిల్ సప్లై, లీగల్ సెల్ తదితర శాఖలకు సంబంధించిన భూ సమస్యలు, రీ-సర్వే, ఇళ్ల స్థలాలు, ల్యాండ్ అండ్ సివిల్, ఎఫ్-లైన్, మ్యుటేషన్లు, ఆక్రమణలు తదితర అంశాలపై ప్రజల నుంచి వినతులు అందుతున్నాయని తెలిపారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలపై అధికారులు సత్వరమే స్పందించి, అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి సమస్యపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి, తీసుకున్న చర్యలను ఎండార్స్‌మెంట్ రూపంలో అర్జీదారులకు అందించాలని ఆదేశించారు.
సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందా, లేదా అనే విషయాన్ని కూడా అర్జీదారులకు స్పష్టంగా తెలియజేయాలని అన్నారు.ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.మీకోసం సేవలు పొందిన ఫిర్యాదుదారులు ఫీడ్‌బ్యాక్ సిటిజన్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయవచ్చని తెలిపారు.
అలాగే 1100 టోల్‌ఫ్రీ నంబర్, meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ 9552300009 ద్వారా 300కు పైగా ప్రభుత్వ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో వి. సుబ్బారావు, డిప్యూటీ కలెక్టర్ డి. అచ్యుత కుమారి, డీఆర్‌డీఏ పీడీ డి. రాంబాబు, సమగ్ర శిక్ష పీడీ జి. మమ్మీ, డ్వామా పీడీ జి.ఎస్. రామగోపాల్, జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారిణి వి. విజయలక్ష్మి, డీఎల్‌డీవో అమలాపురం పి. విజయభాస్కర్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




