Amalapuram: అమలాపురంలో ఘనంగా పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి

Amalapuram: అమలాపురం కలెక్టరేట్‌లో పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలు. రాష్ట్ర పండుగగా నిర్వహించడం సంతోషకరమన్న కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్.

SURESH, AMALAPURAM
Published on: 7 Aug 2026 4:45 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురంలో ఘనంగా పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి

అమలాపురం: పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం సంతోషకరం జిల్లా కలెక్టర్ డా. ఆర్.మహేష్ కుమార్ అగ్నికుల క్షత్రియ సమాజ అభ్యున్నతికి విశేష కృషి చేశారని వారి సేవలు చిరస్మరణీయం.

పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా రాష్ట్ర పండుగగా ప్రకటించి నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయమని జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ తెలిపారు.

స్థానిక కలెక్టరేట్ లో గోదావరి భవన్ నందుపొన్నమండ లక్ష్మణస్వామి వర్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పొనమండ లక్ష్మణస్వామి వర్మ అగ్నికుల క్షత్రియ సమాజానికి,పేదల అభ్యున్నతికి ప్రత్యేక గుర్తింపు, హక్కులు,గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు విశేషంగా కృషి చేశారని గుర్తుచేశారు.

1869లో జన్మించిన లక్ష్మణస్వామి 1980 కాకినాడ సమీపంలోని కోరంగి గ్రామంలో అగ్నికుల క్షత్రియ ప్రప్రధమ రాష్ట్రస్థాయి సభను నిర్వహించి,ఆ సమాజిక వర్గీయులను ఒక తాటిపై తీసుకువచ్చారన్నారు.1920వ దశకంలో అగ్నికుల క్షత్రియ కమ్యూనిటీకి ప్రత్యేకమైన పేరు, గుర్తింపు,సమాజంలో తగిన స్థానం కల్పించేందుకు అనేక పోరాటాలు,కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.

సమాజ అభ్యున్నతి,హక్కుల సాధన కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కలెక్టర్ అన్నారు.ప్రతి ఏటా రాష్ట్ర పండుగగా ప్రతి సంవత్సరం ఆగస్టు 7న వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు.అగ్నికుల క్షత్రియ కమ్యూనిటీ సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, అవసరమైన సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి సుబ్బారావు,జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి పి భగవాన్ సహాయ బిసి సంక్షేమ అధికారి కె ఎన్.దొర,స్థానిక ప్రజాప్రతినిధులు, కమ్యూనిటీ పెద్దలు,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story