Amalapuram: స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా జరగాలి కలెక్టర్ మహేష్ కుమార్

Amalapuram: కోనసీమ జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరపాలి. అమలాపురం ఎస్‌కేబీఆర్ కళాశాల కౌంటింగ్ కేంద్రం, ఈదరపల్లి నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్.

SURESH, AMALAPURAM
Published on: 23 Oct 2026 10:54 PM IST
Amalapuram
X

Amalapuram: స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా జరగాలి కలెక్టర్ మహేష్ కుమార్

అమలాపురం: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి ఎంపీటీసీ,జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్.స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛాయుత,నిష్పక్షపాత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం అమలాపురం పట్టణ పరిధిలోని ఎస్.కె.బి.ఆర్. కళాశాల,ఈదరపల్లి ఎంపీడీవో కార్యాలయాలను జిల్లా కలెక్టర్ సందర్శించి,మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లతో పాటు ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

ఎస్.కె.బి.ఆర్.కళాశాలలోని కామర్స్ బ్లాక్‌లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన క్యూలైన్లు,కౌంటింగ్ టేబుళ్లు, భౌగోళిక నమూనా ఆధారంగా చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించి,ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,కౌంటింగ్ ప్రక్రియ సజావుగా,పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రంలోని ప్రతి బ్లాక్‌లో అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు,ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.

కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని స్పష్టం చేశారు.ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియపై క్షేత్రస్థాయి పరిశీలన

అనంతరం ఈదరపల్లి ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్,ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలు,ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని సూచించారు.

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ల కేంద్రాల వద్ద అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకుని,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వర్తించే అధికారులు సమన్వయంతో పనిచేస్తూ,ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ ఆఫీసర్ ఎం. నిర్మల్ కుమార్,కొత్తపేట డీఎస్పీ ఎం.శంకర్ మురళీమోహన్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రాణి సంయుక్త తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM