Amalapuram: అటవీ భూముల రీ-సర్వే పనులు వేగవంతం చేయాలి కలెక్టర్!

Amalapuram: కోనసీమ జిల్లాలో రక్షిత అటవీ భూముల రీ-సర్వే, 22-A కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన ఇంచార్జ్ కలెక్టర్ వై. ఖోమ్.నైడియా దేవి.

SURESH, AMALAPURAM
Published on: 16 Sept 2026 4:09 PM IST
Amalapuram
X

Amalapuram: అటవీ భూముల రీ-సర్వే పనులు వేగవంతం చేయాలి కలెక్టర్!

Amalapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రక్షిత అటవీ భూములపై రీ సర్వే పనులు పక్కా ప్రణాళికలతో చర్యలు చేపట్టాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ వై. ఖోమ్.నైడియా దేవి తెలిపారు. బుధవారం అమరావతి నుండి చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్ భూ పరిపాలన చీఫ్ కమిషనర్ అధికారిణి జి. జయలక్ష్మితో కలిసి వివిధ జిల్లాలోని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిషేధిత భూములు 22-A, రీ సర్వే పనులు,పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, డిజిటలైజేషన్ రెవిన్యూ రికార్డ్స్, రక్షిత అటవీ భూముల పురోగతి, పిజిఆర్ఎస్ వంటి అంశాల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్ లోని జిల్లా జాయింట్ కలెక్టర్ చాంబర్ నందు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ రీ-సర్వే కార్యక్రమం,22-A నిషేధిత భూముల జాబితా సవరణ,కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, డిజిటలైజేషన్ రెవిన్యూ రికార్డ్స్, రక్షిత అటవీ భూముల పురోగతి, పిజిఆర్ఎస్ ప్రక్రియపై ఆర్డీవోలు తాసిల్దారర్లు అధికారులకు ఆమె దిశా నిర్దేశం చేశారు.అదేవిధంగా రోజువారి సమీక్షలు తప్పనిసరిగా పాటించాలని, రెవిన్యూ అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఇంచార్జ్ కలెక్టర్ ఆదేశించారు. నియోజకవర్గంలో ని ఆర్డీవోలు పర్యవేక్షణ సర్వే పనులపై సమీక్షలు నిరంతరం కొనసాగించాలన్నారు.

నిర్దేశించిన లక్ష్యసాధనలు చేరుకునేలా స్పష్టమైన ప్రణాళికలతో ముందడుగు వేయాలన్నారు.అదేవిధంగా పట్టాదార్ పాసు పుస్తకాల ప్రింటింగ్ విషయంలో సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు లోపాలను సరిచేసి పంపిణీ విషయంలో వేగం పెంచాలన్నారు.జిల్లాలో నిషేధిత భూముల 22-A కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని, అమలాపురం కాట్రేనికోన రాజోలు పెండింగ్ లో ఉన్న నిషేధిత భూముల కేసులపై తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు.జిల్లాలో డిజిటలైజేషన్ ఆఫ్ రెవిన్యూ రికార్డ్స్ పనులను పూర్తి చేయాలని,డాక్యుమెంట్ ఎక్స్ట్రాక్షన్ స్టేటస్ రిపోర్ట్ ను పూర్తి చేసి తగిన చర్యలు రెవిన్యూ అధికారులను తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో తీర ప్రాంత రక్షిత అటవీ భూములు రీ సర్వే పనులు వేగవంతం చేయాలన్నారు.

అల్లవరం మండలంలో బెండమూర్ల లంక,ఐ.పోలవరం మండలంలో గుత్తెన దీవి రీ సర్వే పనులు పూర్తి చేశారని మిగతా తీర ప్రాంత రక్షిత అటవీ భూములకు త్వరితిగతిన పూర్తి చేయాలన్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల సమస్యలను జవాబుదారీతనంతో పారదర్శకంగా నిర్వహించాలని ఆమె కోరారు.జిల్లా,డివిజన్ మండల స్థాయిలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కార మార్గాలు చూపాలని,పరిష్కారం కానీ అర్జీలను అర్జీదారులకు తెలియజేయాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ వై.ఖోమ్.నైడియా దేవి తెలియజేసారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM