Amalapuram: కోనసీమ కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
Amalapuram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్‌లో జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్, ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
Amalapuram: కోనసీమ కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
Amalapuram: అమలాపురం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రతి అర్జీపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియా దేవి, డిఆర్ఓ వి సుబ్బారావు, ఆర్డిఓ మమ్మీ లు సుమారుగా 215 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
ప్రతి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపి సంతృప్తి స్థాయిలను నూటికి నూరు శాతం చేరుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం ద్వారా వచ్చే ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలని, ప్రతి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ జిల్లాస్థాయి అధికారులు నిర్దేశ గడువులోగా అర్జీల పరిష్కారానికి కృషిచేయాలని ఆదేశించారు.
అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలని, అర్జీదారులకు సకాలంలో సమాచారం అందిస్తూ పారదర్శకత పాటించాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. పిజిఆర్ఎస్ ద్వారా అందుతున్న అర్జీల పరిష్కారంలో హేతుబద్ధత కలిగి ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైధియాదేవి తెలిపారు. అర్జీలను సమగ్రంగా పరి శీలించి, వాటికి తగిన పరిష్కార మార్గాలను త్వరితగతిన చూపాలని అధికారులకు సూచించారు.
ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకత, సమర్థత పాటించడం అత్యంత ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ప్రతి అర్జీని బాధ్యతగా తీసుకుని, నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు సకాలంలో సేవలు అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ పి డి డి రాంబాబు, డిఎ ల్డివోలు రాజేశ్వరరావు వేణుగో పాల్, కలెక్టరేట్ పరిపాలన అధికారి కాశీవిశ్వేశ్వరరావు, జిల్లాస్థాయి అధికారులు వికాస జిల్లా మేనేజర్ జి రమేష్ తదితరులు పాల్గొన్నారు.




