Amalapuram: ఢిల్లీ లాఠీచార్జికి నిరసనగా అమలాపురంలో కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ

Amalapuram: ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జిని ఖండిస్తూ అమలాపురంలో కాంగ్రెస్, పీడీఎస్‌యూ నిరసన. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్.

SURESH, AMALAPURAM
Published on: 22 July 2026 9:05 PM IST
Amalapuram
X

Amalapuram: ఢిల్లీ లాఠీచార్జికి నిరసనగా అమలాపురంలో కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ

అమలాపురం: అమలాపురంలో కాంగ్రెస్, విద్యార్థి సంఘాల కొవ్వొత్తుల ర్యాలీ.అమలాపురం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ,కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీల అరెస్టులను నిరసిస్తూ అమలాపురంలో కాంగ్రెస్ పార్టీ, పీడీఎస్‌యూ,విద్యార్థి సంఘాలు,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

గడియార స్తంభం సెంటర్‌లో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విద్యార్థులపై లాఠీచార్జి చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆరోపించారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని,ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,పీడీఎస్‌యూ ప్రతినిధులు,విద్యార్థి సంఘాల నాయకులు,ప్రజాసంఘాల ప్రతినిధులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story