Amalapuram: గత 6 నెలలుగా మూతపడిన డిజిటల్ లైబ్రరీ.. కలెక్టర్‌కు వినతిపత్రం

Amalapuram: అమలాపురం 11వ వార్డు అశోక్‌నగర్‌లోని అంబేద్కర్ డిజిటల్ లైబ్రరీని వెంటనే ప్రారంభించాలని బీఎస్పీ అమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి మోహన్‌బాబు డిమాండ్ చేశారు.

SURESH, AMALAPURAM
Published on: 24 Aug 2026 3:09 PM IST
Amalapuram
X

Amalapuram: గత 6 నెలలుగా మూతపడిన డిజిటల్ లైబ్రరీ.. కలెక్టర్‌కు వినతిపత్రం

అమలాపురం: అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు అశోక్‌నగర్‌లో ఉన్న అంబేద్కర్ డిజిటల్ లైబ్రరీని వెంటనే తిరిగి ప్రారంభించాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి మోహన్‌బాబు డిమాండ్ చేశారు.

గత ఆరు నెలలుగా ఈ డిజిటల్ లైబ్రరీ మూసివేసి ఉండటంతో పేద,మధ్యతరగతి విద్యార్థులు,నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు.వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ లైబ్రరీ ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, ఇక్కడ చదువుకుని పలువురు పోటీ పరీక్షల్లో విజయాలు సాధించారని తెలిపారు.

లైబ్రరీ మూసివేత కారణంగా విద్యార్థులు,నిరుద్యోగులకు చదువుకునే అవకాశం లేకుండా పోయిందని పేర్కొంటూ సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)లో జిల్లా కలెక్టర్‌కు సమస్యను వివరించారు.

అశోక్‌నగర్‌లోని అంబేద్కర్ డిజిటల్ లైబ్రరీని తక్షణమే పునఃప్రారంభించాలని కలెక్టర్‌ను కోరారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ పి.నాగేశ్వరరావు, మోహన్‌బాబు,శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story