Amalapuram: అమలాపురంలో దస్తావేజు లేఖర్ల ఆందోళన జీవో 396 రద్దుకు డిమాండ్
Amalapuram: జీవో 396తో ఉపాధి దెబ్బతింటుందని అమలాపురంలో దస్తావేజు లేఖర్ల నిరసన. జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పణ.
Amalapuram: అమలాపురంలో దస్తావేజు లేఖర్ల ఆందోళన జీవో 396 రద్దుకు డిమాండ్
అమలాపురం: అమలాపురంలో దస్తావేజు లేఖర్లు జీవో నంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.ఈ జీవో అమల్లోకి వస్తే దస్తావేజు లేఖర్లతో పాటు రిజిస్ట్రేషన్ సేవలకు సంబంధించిన టైపిస్టులు, కంప్యూటర్ ఆపరేటర్లు, జిరాక్స్ కేంద్రాల నిర్వాహకుల ఉపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తరతరాలుగా దస్తావేజుల రచన ద్వారా జీవనోపాధి పొందుతున్న వేలాది కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయని పేర్కొన్నారు.ప్రభుత్వం వెంటనే జీవో 396ను రద్దు చేసి తమ హక్కులు,ఉపాధిని కాపాడాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Next Story




