Amalapuram: ఘనంగా మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి జయంతి

Amalapuram: అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి 78వ జయంతిని ఘనంగా నిర్వహించారు.

SURESH, AMALAPURAM
Published on: 1 Sept 2026 10:02 PM IST
Amalapuram
X

Amalapuram: ఘనంగా మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి జయంతి

అమలాపురం: అమలాపురం మాజీ శాసనసభ్యులు స్వర్గీయ కుడిపూడి చిట్టబ్బాయి 78వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి అమలాపురం నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.​ఈ సందర్భంగా డాక్టర్ పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ.. కుడిపూడి చిట్టబ్బాయి అమలాపురం నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం పనిచేసిన ప్రజానాయకుడని కొనియాడారు.

సామాన్య ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలిచిన చిట్టబ్బాయి సేవలు అమలాపురం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్,మాజీ ఎంపీ చింతా అనురాధ,ఎస్ఈసీ సభ్యులు కుడుపూడి భరత్,కుడిపూడి బాబు,రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు,వంటెద్దు వెంకన్నాయుడు, అల్లవరం మండల అధ్యక్షుడు కొనుకు బాపూజీ,జెడ్పీటీసీలు పందిరి శ్రీహరి, కొనుకు గౌతమి,జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర,రాష్ట్ర ఆర్టీఐ జోన్ 2 అధ్యక్షుడు వర్మ,రాష్ట్ర మున్సిపల్ విభాగ కార్యదర్శి గొవ్వల రాజేష్,రాష్ట్ర ఆర్టీఐ విభాగ కార్యదర్శి సుంకర సుధ,రాష్ట్ర ఇంటిలెక్చువల్ కార్యదర్శి రాజుతో పాటు జిల్లా, నియోజకవర్గ,మండల,గ్రామ స్థాయి నాయకులు,ప్రజా ప్రతినిధులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story