Amalapuram: పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి
Amalapuram: అమలాపురం కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణ. 295 దరఖాస్తులు అందగా, గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపాలని డీఆర్వో వి. సుబ్బారావు అధికారులను ఆదేశించారు.
Amalapuram: పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి
అమలాపురం: ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి,తక్షణ పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని, పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలను తప్పనిసరిగా నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అధికారి వి.సుబ్బారావు అధికారులను ఆదేశించారు.
ఈ రోజు సోమవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్ లో జరిగింది.ఈ కార్యక్రమంలో డీఆర్వో వి.సుబ్బారావు,ఎస్డీసీ అచ్చుతాకుమారి,డీఆర్డీఏ పీడీ డి.రాంబాబు,డ్వామా పీడీ జీఎస్.రామ్ గోపాల్,సమగ్ర శిక్ష ఏపీడీ మమ్మి,డీఎల్డీవో విజయ్ భాస్కర్ తదితరులతో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు, దరఖాస్తులు స్వీకరించారు.
భూ రికార్డు ఆన్ లైన్ లో నమోదు,రీ-సర్వే, భూ ఆక్రమణలు,ఉద్యోగ ఉపాధి అవకాశాలు,పారిశుధ్యం,మురికి కాలువలకు పుడికతీత, ఇంటిస్థలం,గృహం,పింఛను, సదరం సర్టిఫికెట్,రోడ్లు మంజురు వంటి అంశాలపై మొత్తం 295 అర్జీలు అందాయి.ఈ అర్జీలను సంబంధిత అధికారులకు సూచిస్తూ సకాలంలో పరిష్కరించాలని డి ఆర్ ఓ ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రతిష్టాత్మకంగా పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు.ఈ నేపథ్యంలో ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టి తక్షణ పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా వివిధ శాఖల్లో నమోదైన అర్జీలపై వెంటనే స్పందించి,క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
అర్జీదారుల సంతృప్తికరమైన పరిష్కారాలు అందించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పరిష్కరించిన అర్జీల నివేదికలను సక్రమంగా ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని సూచించారు.ప్రజలు తమ ఫిర్యాదుల కోసం 1100 టోల్ ఫ్రీ నెంబర్, మీకోసం ఆన్ లైన్ పోర్టల్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని,అలాగే అర్జీల పరిష్కార పురోగతిని నేరుగా తెలుసుకోవచ్చని డి ఆర్ ఓ తెలిపారు.
ప్రజల తమ సమస్యలపై తమ పరిధిలోని డివిజన్,మండల,స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయంలో స్థాయిలలో అధికారులకు సమర్పించవచ్చని,రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సేవలను జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్ లు ఇతర అధికారులు,తదితరులు పాల్గొన్నారు.




