Amalapuram: అమలాపురంలో ఘనంగా మధు పౌర్ణమి వేడుకలు ప్రత్యేక పూజలు

Amalapuram: అమలాపురంలో ఘనంగా మధు పౌర్ణమి వేడుకలు. త్రిరత్న బుద్ధ విహార్‌లో ప్రత్యేక ప్రార్థనలు, బుద్ధుని అష్టాంగ మార్గాల ప్రాముఖ్యతను వివరించిన నిపుణులు.

SURESH, AMALAPURAM
Published on: 26 Sept 2026 11:58 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురంలో ఘనంగా మధు పౌర్ణమి వేడుకలు ప్రత్యేక పూజలు

అమలాపురం: సమాజ అభ్యున్నతికి అష్టాంగ మార్గాలే శరణ్యం వీశ్వశాంతితో పాటు సమాజ అభ్యున్నతికి గౌతమ బుద్ధుడు ప్రబోధించిన అష్టాంగ మార్గాలే శరణ్యమని అమలాపురంలో త్రిరత్న బుద్ధ విహార్ వ్యవస్థాపకుడు గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు.

ప్రపంచ బౌద్ధులకు మధు పౌర్ణమి అతి ముఖ్యమైన పండుగ రోజన్నారు.మధు పౌర్ణమిని పురస్కరించుకుని బుద్ద విహార్ లో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా బౌద్ధ ఉపాసకులు డీ.బీ.లోక్,మట్టా వెంకట్రావు,భానోజీ మాస్టారులు మాట్లాడుతూ అష్టాంగ మార్గాల్లో వాక్కు అత్యంత ప్రధానమైనదని వివరించారు.

గౌతమ బుద్ధుడు చూపించిన మార్గాల్లో మనసును ఏ విధంగా నియంత్రించుకోవాలో వివరించారు.ఏది సత్యమో అదే జ్ఞానమన్నారు.ధర్మబద్ధమైన జీవన విధానాన్ని కొనసాగించాలని సూచించారు.బౌద్ధ మందిరంలో ప్రత్యేక ప్రార్థనల్లో పలువురు ఉపాసకులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కేవీవీ సత్యనారాయణ,కె.రామ్మూర్తి, ఉండ్రు శ్యామలరావు,దుక్కిపాటి సూర్యనారాయణ, బి.ప్రసాదరావు,మట్టా కిషోర్ తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM