Amalapuram: ఆగస్టు 1న అమలాపురంలో మెగా జాబ్ మేళా

Amalapuram: అమలాపురం డిగ్రీ కాలేజీలో ఆగస్టు 1న మెగా జాబ్ మేళా. 600కు పైగా ఉద్యోగాలు. పోస్టర్ ఆవిష్కరించిన కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.

SURESH, AMALAPURAM
Published on: 28 July 2026 12:01 AM IST
Amalapuram
X

Amalapuram: ఆగస్టు 1న అమలాపురంలో మెగా జాబ్ మేళా

అమలాపురం: అమలాపురం ది అమలాపురం డిగ్రీ కాలేజీ నందు ఆగస్టు 01న నిర్వహించే మెగా జాబ్ మేళా ను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్.ఆర్.మహేష్ కుమార్ సూచించారు.శనివారం అమలాపురం కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ చేతుల మీదుగా మెగా జాబ్ మేళా గోడపత్రికను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని యువతీ,యువకులకు ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి మరియు జిల్లా ఉపాధి కార్యాలయం వారి ఆధ్వర్యంలో ది అమలాపురం డిగ్రీ కళాశాల నందు ఆగస్టు 01 వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 10 ప్రముఖ కంపెనీలతో పాటు, మరికొన్ని ఇతర కంపెనీలలో ఉద్యోగఅవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు.వివిధ కంపెనీలలో మొత్తం 600 లకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందని,18 - 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన స్త్రీ,పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులన్నారు.

కంపెనీల నియమాలను అనుసరించి ఎంపిక చేస్తారని, నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న వారు ఈ లింక్ నందు https://naipunyam.ap.gov.in రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరు కావాలని,ఇతర వివరములకు

ఈ క్రింది నెంబర్ల నందు:

9000831156, 9380808275

9988853335, 8712655686

సంప్రదించాలని తెలిపారు. గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారి ఆర్.వహీదా,జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఓ.నాగబాబు,వికాస జిల్లా అధికారి జి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story