Amalapuram: కామనగరువులో ఎమ్మెల్యే ఆనందరావు ఇంటింటి ప్రచారం

Amalapuram: కామనగరువులో '2 ఏళ్ల నమ్మకం' ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందరావు. సమస్య చెప్పిన వెంటనే రోడ్డు మంజూరుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు.

SURESH, AMALAPURAM
Published on: 28 July 2026 5:25 PM IST
Amalapuram
X

Amalapuram: కామనగరువులో ఎమ్మెల్యే ఆనందరావు ఇంటింటి ప్రచారం

అమలాపురం: అమలాపురం నియోజకవర్గం కామనగరువులో హోరెత్తిన “2 ఏళ్ల నమ్మకం” రెండో రోజు ఇంటింటికీ ప్రచారం రెండో రోజు పర్యటించిన ఎమ్మెల్యే ఆనందరావు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అమలాపురం నియోజకవర్గంలో చేపట్టిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి, సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమం రెండో రోజు కామనగరువు గ్రామంలో అత్యంత ఉత్సాహంగా సాగింది.

స్థానిక శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు మంగళవారం గ్రామంలో విస్తృతంగా పర్యటించి ప్రతి గడపకూ వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడారు.ఈ పర్యటనలో భాగంగా గ్రామస్తులు తమ వీధికి రోడ్డు సౌకర్యం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా,ఆయన తక్షణమే స్పందించారు.

అక్కడికక్కడే పంచాయతీ కార్యదర్శిని పిలిపించి,సమస్య తీవ్రతను క్షేత్రస్థాయిలో చూపించారు.ప్రజల ఇబ్బందులను వెంటనే తొలగించాలి,తక్షణమే ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి సత్వరమే మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోండి అని సంబంధిత అధికారిని ఎమ్మెల్యే ఆనందరావు అక్కడికక్కడే ఆదేశించారు. ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిన చొరవకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి గడిచిన రెండేళ్లలో కూటమి సర్కార్ అందించిన ప్రగతి కరపత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలైన తల్లికి వందనం,స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం,దీపం-2 ఉచిత గ్యాస్,అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మరియు మత్స్యకార వికాసం ద్వారా చేకూరిన ప్రయోజనాలను ప్రజలకు వివరంగా వెల్లడించారు.

స్థానిక ప్రజల సమస్యలను,వారి సూచనలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.అలాగే బాధితులు తెలిపిన సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు, అక్కడికక్కడే మైటీడీపి అప్ లో నమోదు చేయించి,వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు వనమాడి సునీత గారు స్థానిక కూటమి పార్టీల ముఖ్య నాయకులు, క్లస్టర్-యూనిట్-బూత్ (CUB) ఇన్ఛార్జ్‌లు,కార్యకర్తలు మరియు కామనగరువు గ్రామ ప్రజలు అధికసంఖ్యలో సంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story