Amalapuram: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ప్రచార వ్యూహాలు!
Amalapuram: అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు నేతృత్వంలో అల్లవరం మండలంలో కూటమి నేతలతో కీలక సమీక్షా సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చ.
Amalapuram: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ప్రచార వ్యూహాలు!
Amalapuram: అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు నేతృత్వంలో అల్లవరం మండలంలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ అభ్యర్థులు మరియు కూటమి ముఖ్య నాయకులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగించడమే లక్ష్యంగా ప్రచార వ్యూహాలు,క్షేత్రస్థాయి సమన్వయంపై నాయకులకు ఎమ్మెల్యే ఆనందరావు దిశానిర్దేశం చేశారు.ప్రతీ గడపకూ ప్రభుత్వ సంక్షేమం,అభివృద్ధి ఫలాలను తీసుకెళ్లి కూటమి అభ్యర్థుల ఘన విజయానికి శ్రమించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో అల్లవరం మండల టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి నాయకులు,ఎంపీటీసీ/జెడ్పీటీసీ అభ్యర్థులు మరియు కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




