Amalapuram: అమలాపురం పేరూరులో ఘనంగా తిరంగా బైక్ ర్యాలీ

Amalapuram: స్వాతంత్య్ర దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా అమలాపురం రూరల్ మండలం పేరూరులో ఎమ్మెల్యే ఆనందరావు ఆధ్వర్యంలో భారీ తిరంగా బైక్ ర్యాలీ.

SURESH, AMALAPURAM
Published on: 12 Aug 2026 11:49 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురం పేరూరులో ఘనంగా తిరంగా బైక్ ర్యాలీ

అమలాపురం: స్వాతంత్య్ర దినోత్స వారోత్సవాల్లో భాగంగా అమలాపురం రూరల్ మండలం,పేరూరులో బైక్ ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్యే ఆనందరావు

దేశ స్వాతంత్య్ర దినోత్సవ వారోత్సవాలు మరియు 'స్త్రీ శక్తి' పథకం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అమలాపురం నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామంలో ఎమ్మెల్యే ఆనందరావు నాయకత్వంలో బుధవారం భారీ బైక్ ర్యాలీ (తిరంగా యాత్ర) నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని, దేశభక్తిని ప్రతి ఒక్కరిలో పెంపొందించడమే లక్ష్యంగా ఈ తిరంగా యాత్ర చేపట్టామని తెలిపారు.ఆగస్టు 12 నుండి 15 వరకు నియోజకవర్గంలోని ప్రతి ఇంటిపైనా,వ్యాపార సంస్థలపైనా జాతీయ జెండాను రెపరెపలాడించాలని,ప్రతి ఒక్కరూ 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ర్యాలీలో పాల్గొన్న కూటమి కార్యకర్తలు,నాయకులు జాతీయ జెండాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, క్లస్టర్,యూనిట్,బూత్ మరియు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story