Amalapuram: అమలాపురం అభివృద్ధికి రూ.30 కోట్ల నిధులు సాధించిన ఎమ్మెల్యే ఆనందరావు

Amalapuram: అమలాపురం అభివృద్ధికి రూ.30 కోట్ల నిధులు తేవడంతో పాటు ఇందుపల్లి ముంపు నివారణకు రూ.8 కోట్లు సాధించిన ఎమ్మెల్యే ఆనందరావు. అభినందించిన కూటమి నాయకులు.

SURESH, AMALAPURAM
Published on: 26 Sept 2026 11:23 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురం అభివృద్ధికి రూ.30 కోట్ల నిధులు సాధించిన ఎమ్మెల్యే ఆనందరావు

అమలాపురం: అమలాపురం అభివృద్ధికి రూ.30 కోట్ల నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే ఆనందరావు కు కూటమి కార్యకర్తలు, నాయకులు అభినందనలు తెలియజేసారు.ఇందుపల్లి ముంపు నివారణకు రూ. 8 కోట్లతో అక్విడక్ట్ నిర్మాణానికి మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు.

ఈ రోజు అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద శనివారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి ఎమ్మెల్యే నేరుగా 19 అర్జీలను (వినతి పత్రాలను) స్వీకరించారు.

వినతులను క్షుణ్ణంగా పరిశీలించి,వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ సాధారణంగా ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజాదర్బార్‌ను ఈ వారం విజయవాడ పర్యటన వల్ల శనివారం నిర్వహించడం జరిగింది.

నియోజకవర్గ అభివృద్ధి,నిధుల సమీకరణ కోసం విజయవాడ వెళ్లాను. పలువురు మంత్రులను కలిసి అమలాపురం నియోజకవర్గానికి రూ. 30 కోట్ల అభివృద్ధి నిధులను మంజూరు చేయించుకుని రావడం జరిగింది అని హర్షం వ్యక్తం చేశారు.

అలాగే ఇందుపల్లి గ్రామం తరచూ వరద ముంపునకు గురవుతుండటాన్ని ప్రస్తావిస్తూ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా నూతన ఆక్విడక్ట్ (Aqieduct) నిర్మాణానికి నిధులు కేటాయించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని కోరగా,వారు సానుకూలంగా స్పందించి రూ. 8 కోట్లు మంజూరు చేసేందుకు హామీ ఇచ్చారని తెలిపారు.

అమలాపురం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ నిధులు తీసుకురావడంతో పాటు ఇందుపల్లి ముంపు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న ఎమ్మెల్యే ఆనందరావు కి కూటమి నాయకులు,ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు,నాయకులు పలు శాఖల అధికారులు,అధికసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM