Amalapuram: మునిపల్లిలో రూ.49 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
Amalapuram: ఉప్పలగుప్తం మండలం మునిపల్లిలో 'పల్లె పండుగ 3.0' కింద రూ.49 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు శంకుస్థాపన చేశారు.
Amalapuram: మునిపల్లిలో రూ.49 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
Amalapuram: అమరావతి కోసం సీఎం చంద్రబాబునాయుడు గారు, గ్రామాభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు: ఎమ్మెల్యే ఆనందరావు రూ. 11,085 కోట్లతో పల్లె పండుగ 3.0 గ్రామాల్లో మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే ఆనందరావు.కూటమి ప్రభుత్వంలోనే గ్రామాల్లో అభివృద్ధి పనుల పండుగ మునిపల్లి శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందరావు వ్యాఖ్యలు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా ఉప్పలగుప్తం మండలం మునిపల్లి గ్రామంలో రూ.49 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సి.సి.రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ రోడ్లు, డ్రైన్లు,గ్రామ పంచాయతీ భవనాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.11,085 కోట్ల భారీ నిధులతో "పల్లె పండుగ 3.0" కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణం మరియు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు.అలాగే ఉపముఖ్యమంత్రి పంచాయతీ రాజ్ శాఖామంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల పురోగతికి,మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆగిపోయిన అభివృద్ధి పనులన్నీ వేగవంతమయ్యాయని, మున్ముందు మరెన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గంలో చేపట్టే అవకాశం లభించిందని తెలిపారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు నిరంతరం అండగా నిలవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




