Amalapuram: చంద్రబాబు వ్యాఖ్యలన్నీ అసత్యాలే - ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్
Amalapuram: వైఎస్ జగన్‌పై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అసత్యాలని అమలాపురంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఖండించారు. లోకేష్‌పై సీబీఐ విచారణకు సవాల్ విసిరారు.
Amalapuram: చంద్రబాబు వ్యాఖ్యలన్నీ అసత్యాలే - ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్
అమలాపురం: చంద్రబాబు వ్యాఖ్యలు అన్ని అసత్య ఆరోపణలు అని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్‌పై చేసిన వ్యాఖ్యలు అసత్య ఆరోపణలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ తీవ్రంగా ఖండించరు.
‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం కోసం కోనసీమ కు వచ్చిన ముఖ్యమంత్రి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
నారా లోకేష్‌పై వస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధమా అని ప్రశ్నించిన ఎమ్మెల్సీ ఇసుక,మట్టి,లిక్కర్ వ్యవహారాలపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్సీ సవాల్ చేశారు.
గత వైస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్,గ్రామ సచివాలయ వ్యవస్థలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.సూపర్ సిక్స్ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతున్నారని విమర్శించారు.
వివేకానందరెడ్డి హత్య కేసును రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకోవడం సరికాదన్నారు.మీడియా, రైతులు,అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని కూటమి నేతలకు సూచించారు.స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బొమ్మి ఇజ్రాయిల్ ఆరోపించారు.




