Amalapuram: మోడీ క్రికెట్ లీగ్‌ను ప్రారంభించిన ఎంపీ గంటి హరీష్ బాలయోగి

Amalapuram: అమలాపురం జీఎంసీ బాలయోగి ఘాట్ వద్ద మోడీ క్రికెట్ లీగ్‌ను ప్రారంభించిన ఎంపీ హరీష్ బాలయోగి. క్రీడలతో యువతలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని వెల్లడి.

SURESH, AMALAPURAM
Published on: 22 Aug 2026 6:05 PM IST
Amalapuram
X

Amalapuram: మోడీ క్రికెట్ లీగ్‌ను ప్రారంభించిన ఎంపీ గంటి హరీష్ బాలయోగి

అమలాపురం: అమలాపురం నల్లవంతెన సమీపంలోని జీఎంసీ బాలయోగి ఘాట్ వద్ద నల్లా చారిటబుల్ ట్రస్ట్,బీజేపీ నాయకులు నల్లా పవన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మోడీ క్రికెట్ లీగ్ ను అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ హరీష్ బాలయోగి దివంగత నేత బాలయోగి స్టేడియం లో క్రీడాకారులను పరిచయం చేసుకుని,వారితో కలిసి కాసేపు ముచ్చటించారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి క్రీడాకారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు.

యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని ఎంపీ హరీష్ బాలయోగి అన్నారు. క్రీడలతో యువతలో ఆరోగ్యం, క్రమశిక్షణ,నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,నల్లా చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు,బీజేపీ నాయకులు,క్రీడాకారులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story