Amalapuram: గల్లంతైన మత్స్యకారుల గాలింపుపై ఎంపీ హరీష్ సమీక్ష

Amalapuram: ఓడలరేవు తీరంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల గాలింపును వేగవంతం చేయాలని కాకినాడ కోస్ట్ గార్డ్ అధికారులను కోరిన అమలాపురం ఎంపీ హరీష్ మధుర్ బాలయోగి.

SURESH, AMALAPURAM
Published on: 19 Aug 2026 9:20 PM IST
Amalapuram
X

Amalapuram: గల్లంతైన మత్స్యకారుల గాలింపుపై ఎంపీ హరీష్ సమీక్ష

అమలాపురం: ఓడలరేవు సముద్ర తీరంలో గల్లంతైన మత్స్యకారుల గాలింపు చర్యలు మరింత వేగవంతం చేయాలని కోరిన ఎంపీ హరీష్ మధుర్ బాలయోగి.అల్లవరం మండలం ఓడలరేవు సముద్రంలో బోటుపై వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం కూటమి ప్రభుత్వం మరియు అధికార యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టిందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మధుర్ బాలయోగి తెలిపారు.

ఈ మేరకు గాలింపు చర్యలు మరింత వేగవంతం చేయాలని కాకినాడలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులను కలసి కోరారు. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులను వీలైనంత త్వరగా గుర్తించేందుకు ఇండియన్ నేవీ,ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు ఇతర బృందాల ద్వారా గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.

ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారని,అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు.

వీలైనంత త్వరగా గల్లంతైన మత్స్యకారులను గుర్తించి వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ హరీష్ మధుర్ బాలయోగి పేర్కొన్నారు.ఈ సమావేశం లో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్యనారాయణ రాజు(సత్తిబాబు),కోపనాతి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story