Amalapuram: క్షేమంగా లభించిన అమలాపురం మత్స్యకారులు ఎంపీ హరీష్ బాలయోగి

Amalapuram: సముద్ర తీరంలో గల్లంతై ఒడిశాలోని పారాదీప్ తీరంలో సురక్షితంగా బయటపడిన ఏడుగురు మత్స్యకారులతో ఫోన్‌లో మాట్లాడిన అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి.

SURESH, AMALAPURAM
Published on: 26 Aug 2026 9:58 PM IST
Amalapuram
X

Amalapuram: క్షేమంగా లభించిన అమలాపురం మత్స్యకారులు ఎంపీ హరీష్ బాలయోగి

అమలాపురం: ప్రభుత్వ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనం ద్వారా రోడ్డు మార్గాన గురువారం స్వగ్రామం చేరనున్న ఏడుగురు ఎంపీ హరీష్ బాలయోగి.మత్స్యకారుల క్షేమంగా ఉండటంతో గ్రామంలో సంబరాలు చేసుకున్నారు.

ప్రధాని మోదీ, రక్షణ శాఖ రాజ్ నాధ్ సింగ్,ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ హరీష్.గత 23 రోజులుగా అందరూ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయని,సముద్ర తీరంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా వున్నారన్న సమాచారం ఆనందాన్ని కలిగించిందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి అన్నారు.

ఒడిశాలోని పారాదీప్ తీరంలో ఆచూకీ లభించిన ఏడుగురు మత్స్యకారులతో ఎంపీ హరీష్ ఫోన్ లో సంభాషించారు. జరిగిన ఘటనను అడిగి తెలుసుకున్నారు.అందరి ప్రార్థనలు ఫలించాయని చెప్పారు.తమ కుటుంబ సభ్యులకు అండగా నిలబడ్డామని, ప్రభుత్వం తరపున చేసిన ప్రయత్నాలను, సహాయ సహకారాలను వారికి ఎంపీ హరీష్ వివరించారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనం ద్వారా రోడ్డు మార్గాన గురువారం ఏడుగురు మత్స్యకారులు స్వగ్రామం చేరతారని తెలిపారు. గల్లంతైన వారు క్షేమంగా ఉండటంతో ఓడలరేవు గ్రామంలో గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story