Amalapuram: తుఫాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం ఎంపీ హరీష్ బాలయోగి!
Amalapuram: 'అర్నాబ్' తుఫాన్ వేళ కోనసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ హరీష్ బాలయోగి కోరారు. అత్యవసర కంట్రోల్ రూమ్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి.
Amalapuram: తుఫాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం ఎంపీ హరీష్ బాలయోగి!
Amalapuram: అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో అన్ని ఏర్పాట్లు చేశారన్నారు.
ఇప్పటికే తుఫాన్ ప్రారంభం కావడంతో ప్రభుత్వం మరియు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు.ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని,ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని,అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలన్నారు.అవసరమైతే ఈ క్రింది కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ లకు ఫోన్ చేయాలని ఎంపీ హరీష్ సూచించారు.
కంట్రోల్ రూమ్‌ల ఫోన్ నంబర్లు :
1| జిల్లా కలెక్టరేట్, కోనసీమ| 08856-293104
2| ఆర్డీఓ కార్యాలయం, అమలాపురం| 08856-233208
3| ఆర్డీఓ కార్యాలయం, రామచంద్రపురం| 08857-245166
4| ఆర్డీఓ కార్యాలయం, కొత్తపేట| 8500238258
5| ఆర్డీఓ కార్యాలయం, కొత్తపేట| 08855-244299.




