Amalapuram: అమలాపురం మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం!

Amalapuram: అమలాపురం మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం పినిపే విశ్వరూప్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఎన్నికల వ్యూహాలు, కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.

SURESH, AMALAPURAM
Published on: 7 Sept 2026 2:54 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురం మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం!

అమలాపురం: ఈరోజు మాజీ మంత్రి, అమలాపురం పార్లమెంట్ ఇంచార్జ్,పి.ఏ.సి. సభ్యులు పినిపే విశ్వరూప్ అధ్యక్షతన, అమలాపురం అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో అమలాపురం మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళిక,వార్డుల వారీగా ఎన్నికల సన్నాహకాలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు తదితర అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రావు,రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు,వంటెద్దు వెంకన్నాయుడు,పట్టణ అధ్యక్షులు సంసాని నాని,మాజీ మున్సిపల్ ఛైర్మన్ సత్యనాగేంద్ర మణి ,S.E.C మెంబర్ కుడిపూడి భరత్,మరియు సీనియర్ కౌన్సిలర్లు, నాయకులు,కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story