Amalapuram: సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ – 44 బెంచ్‌ల ఏర్పాటు
Amalapuram: సెప్టెంబర్ 12న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 44 బెంచ్‌లలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రకటించారు.
Amalapuram: సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ – 44 బెంచ్‌ల ఏర్పాటు
అమలాపురం: సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 44 బెంచిల ఏర్పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా పాల్గొన్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని తూర్పు గోదావరి, కాకినాడ,డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ,bపోలవరం జిల్లాల్లో మొత్తం 44 బెంచిలలో సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.జాతీయ లోక్ అదాలత్‌కు సంబంధించిన అవగాహన సామగ్రిని మంత్రిత్వ శాఖలు,ప్రభుత్వ విభాగాలు తర భాగస్వాముల వెబ్‌సైట్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రజలకు విస్తృతంగా చేరేలా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.
లోక్ అదాలత్ ఉద్దేశం,ప్రయోజనాలు, పరిష్కరించుకోగల వివాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు న్యాయ సేవా సంస్థలు చర్యలు చేపడుతున్నాయని పేర్కొన్నారు.న్యాయ సేవాధికార సంస్థల చట్టం,1987 ప్రకారం ప్రజలకు న్యాయ ప్రాప్యతను ప్రోత్సహించడంతో పాటు న్యాయ సేవలు వివాద పరిష్కార యంత్రాంగాలపై అవగాహన కల్పించేందుకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (NALSA) వివిధ కార్యక్రమాలను జ్
చేపడుతోందన్నారు.ఈ వ్యవస్థలో లోక్ అదాలత్‌లు కీలకమైన భాగంగా ఉన్నాయని తెలిపారు.లోక్ అదాలత్‌ల ద్వారా వివాదాలను పరస్పర అంగీకారంతో,స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని, సులభంగా అందుబాటులో ఉండే, వేగవంతమైన,తక్కువ ఖర్చుతో కూడిన వివాద పరిష్కార వేదికగా ఇవి ఉపయోగపడతాయని వివరించారు.సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పరిష్కరించదగిన వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు.




