Amalapuram: అమలాపురంలో 36 వార్డులూ కూటమివే ఎమ్మెల్యే ఆనందరావు!
Amalapuram: అమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో 36 వార్డుల్లో కూటమి క్లీన్ స్వీప్ ఖాయమని 2వ వార్డు ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందరావు ధీమా వ్యక్తం చేశారు.
Amalapuram: అమలాపురంలో 36 వార్డులూ కూటమివే ఎమ్మెల్యే ఆనందరావు!
Amalapuram: అమలాపురంలో 36 కు 36 వార్డులూ కూటమివే విజయభేరి మోగించడం ఖాయం ఎమ్మెల్యే ఆనందరావు ధీమా వ్యక్తం చేశారు.మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నల్లా శ్రీధర్ 2వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి కుంచె వెంకన్న బాబు తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమలాపురం పట్టణంలో కూటమి విజయభేరి మోగించింది.
ఈ రోజు అమలాపురం పట్టణం 2వ వార్డులో కూటమి మున్సిపల్ చైర్మన్ (జనసేన పార్టీ) అభ్యర్థి నల్లా శ్రీధర్ (గాజు గ్లాస్ గుర్తు) మరియు 2వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి శ్రీ కుంచె వెంకన్న బాబు (సైకిల్ గుర్తు) విజయాన్ని కాంక్షిస్తూ అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు చేపట్టిన ఎన్నికల ప్రచారం ప్రజాజాతరను తలపించింది.
ఎమ్మెల్యే ఆనందరావు స్వయంగా వీధివీధినా తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తించడంతో కూటమి శ్రేణుల్లో నభూతో నభవిష్యత్ అన్నట్లు ఉత్సాహం వెల్లువెత్తింది.ఈ సందర్భంగా వార్డు ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ "విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలాపురం మున్సిపాలిటీలోని 36 కి 36 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులే క్లీన్ స్వీప్ చేసి తిరుగులేని విజయం సాధించబోతున్నారు.
అమలాపురం పట్టణాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో ప్రణాళికలు రచిస్తోంది.మన మున్సిపాలిటీకి అఖండమైన నిధులు రావాలన్నా, వార్డులన్నీ మోడల్ వార్డులుగా మారాలన్నా కూటమి జెండా ఎగరడం చారిత్రాత్మక అవసరం"అని స్పష్టం చేశారు.అమలాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నల్లా శ్రీధర్ కి గాజు గ్లాస్ గుర్తుపై,
2వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి కుంచె వెంకన్న బాబుకి సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి వార్డు అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని ప్రజలను కోరారు. ప్రచారంలో ఎమ్మెల్యే కి మహిళలు,వృద్ధులు,యువకులు నీరాజనాలు పడుతూ అడుగడుగునా ఘనస్వాగతం పలికారు.ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం,జనసేన, బిజెపి పార్టీల అగ్రనాయకులు, పార్టీ శ్రేణులు,కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




