Amalapuram: అమలాపురం పరిశుభ్రత సేవలకు ప్రతిష్టాత్మక అవార్డు
Amalapuram: కాకినాడలో జరిగిన వర్క్‌షాప్‌లో ఘన వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రత సేవలలో విశేష ప్రతిభ కనబరిచి అవార్డు అందుకున్న అమలాపురం ప్రతినిధులు.
Amalapuram: అమలాపురం పరిశుభ్రత సేవలకు ప్రతిష్టాత్మక అవార్డు
అమలాపురం: కాకినాడ లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఘన వ్యర్థాల నిర్వహణ (Solid Waste Management) పరిశుభ్రత ప్రమాణాల సాధన మరియు గ్రామీణ ప్రాంతాల్లో సమర్థవంతమైన శానిటేషన్ అమలులో విశేష సేవలకు గాను అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా,గర్వంగా ఉంది.
ఈ అవార్డును గౌరవనీయులైన అడిషనల్ కమిషనర్, పంచాయతీరాజ్ శ్రీ సుధాకర్ గారు,జిల్లా పరిషత్ సీఈఓ వి . వి .ఎస్.లక్ష్మణ్ రావు జిల్లా గ్రామ పంచాయతీ అధికారిని డి.శాంత లక్ష్మి మరియు డివిజనల్ పంచాయతీ అధికారి పి.బొజ్జిరాజు చేతుల మీదుగా అందుకోవడం నా జీవితంలో ఒక చిరస్మరణీయ ఘట్టం.
ఈ గుర్తింపు నాకు మరింత బాధ్యతను,సేవా స్పూర్తిని కలిగించింది.నాపై నమ్మకం ఉంచి ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తున్న ఉన్నతాధికారులకు, సహచరులకు మరియు నా కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.




