Amalapuram: సీనియర్ జిమ్ కోచ్ కంకిపాటి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు

Amalapuram: అమలాపురంలో సీనియర్ జిమ్ కోచ్ కంకిపాటి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. క్రీడాకారులకు ప్రోటీన్ షేకులు పంపిణీ చేసి ఘనంగా సత్కరించారు.

SURESH, AMALAPURAM
Published on: 6 Oct 2026 8:56 PM IST
Amalapuram
X

Amalapuram: సీనియర్ జిమ్ కోచ్ కంకిపాటి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు

అమలాపురం: హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ వెంకటేశ్వరరావుకు క్రీడా ప్రముఖులు,క్రీడాకారులు,జిమ్ సభ్యుల సమక్షంలో జన్మదిన వేడుకలను నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు.దీన్ని పురస్కరించుకుని నేషనల్ క్రీడాకారులకు పౌష్టికాహారంతో కూడిన ప్రోటీన్స్ షేకులను పంపిణీ చేసి, mకంకిపాటి వెంకటేశ్వరరావు చేస్తున్న క్రీడా సేవలకు క్రీడా ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు.

గత 20 సంవత్సరాలుగా అమలాపురం కేంద్రంగా కోనసీమ ప్రాంతంలో యువతను వెయిట్ లిఫ్టింగ్,బాడీ బిల్డింగ్,పవర్ లిఫ్టింగ్ మరియు ఫిట్నెస్ లలో ఉచిత శిక్షణ ఇచ్చి జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో ప్రతిభ చూపే విధంగా యువతలో క్రీడా నైపుణ్యతను వెలికి తీయటానికి అనేక క్రీడా పోటీలను నిర్వహించి క్రీడాకారులకు ఎంతగానో సేవ చేస్తున్న వెంకటేశ్వరరావును పుష్ప గుచ్చుముల నిచ్చి,దుస్సాల్వతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేకులను కట్ చేయించారు.

ఈ కార్యక్రమంలో మేకల కిషోర్, ఎం.వి.సముద్రం,ముత్యాల బాబి,ముత్తపత్తుల వెంకటరమణ,వర్మ,గోపి, గంగరాజు,ఉమామహేశ్వరరావు, బత్తుల శ్రీనివాస్,పసుపులేటి శ్రీనివాస్,మాణిక్యాలరావు, బైవరపు రాజేష్,రాహుల్,హెల్త్ ఫిట్నెస్ జిమ్ క్రీడాకారులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM