Amalapuram: ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు కలెక్టర్ హెచ్చరిక

Amalapuram: అమలాపురం నియోజకవర్గంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.

SURESH, AMALAPURAM
Published on: 13 Aug 2026 9:13 PM IST
Amalapuram
X

Amalapuram: ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు కలెక్టర్ హెచ్చరిక

అమలాపురం: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ-2026 పై అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు.ఈఆర్వోలు, ఏఈఆర్వోలు నోటీసులు జారీ,పంపిణీ,విచారణలపై వేగవంతం చేసి ప్రత్యేక దృష్టి సారించాలి.భారత్ ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ-2026లో ఓటర్ జాబితాల సవరణ,నోటీసుల జారీ,పంపిణీ,అభ్యంతరాలు, క్లెయిమ్స్,పెండింగ్ దరఖాస్తులు వంటి అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పూనేఠా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ 2026 వేగవంతం చేసే ప్రక్రియపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణను ఇప్పటికే ప్రచురించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా 57,902 నోటీసులను జారీ చేశామని,వాటిలో 25 శాతం నోటీసుల భౌతిక పంపిణీ పూర్తయిందని ఆయన వివరించారు.

ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో 237 విచారణలు నిర్వహించామని, అయితే 633 గడువు తేదీలు (Dates lapsed) ముగిశాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియ దృష్టిలో ఉంచుకుని, 40 మంది అదనపు ఏఈఆర్ఓ (AERO) లతో తేదీల వారీగా షెడ్యూల్‌ను సిద్ధం చేశామన్నారు.ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ లో గడువు ముగిసిన మరియు పెండింగ్‌లో ఉన్న విచారణలను వేగవంతం చేయడానికి, వీడియో కాన్ఫరెన్స్ (డిజిటల్ కాల్స్) విధానాన్ని వినియోగించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం బుక్ చేసిన కేసులు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయని, రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ పెండింగ్ విచారణలన్నీ ఆన్‌లైన్/డిజిటల్ విధానం ద్వారా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా 18 నుండి 19 సంవత్సరాల వయసు గల యువతను ఓటర్లుగా నమోదు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈఆర్ఓ (ERO), ఏఈఆర్ఓ (AERO)లు, మరియు ఇతర ఎన్నికల అధికారులతో ఓటర్ల జాబితా సవరణ,నోటీసుల బట్వాడా, మరియు విచారణల (Hearings) పురోగతిపై అమలాపురం, రామచంద్రపురం, గన్నవరం,ముమ్మిడివరం, కొత్తపేట తదితర నియోజకవర్గాల అధికారులతో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని తెలియజేశారు.

యువ ఓటర్ల నమోదు జూలై 1 నాటికి 18-20 ఏళ్లు నిండిన యువతలో చాలామంది ఇంకా ఓటర్లుగా నమోదు కాలేదని,ఉన్నత చదువుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల వారు నమోదుకు దూరమై ఉండవచ్చు.కాబట్టి,యువత ఎక్కువగా ఉండే ప్రాంతాలు, కళాశాలల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలి. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించి,ఫారమ్-6 ద్వారా వారిని ఓటర్లుగా నమోదు చేయాలి.నోటీసుల జారీ పంపిణీ విచారణ వంటి విషయాలపై ఓటర్ జాబితా ప్రక్రియపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాబోయే రెండు మూడు రోజుల్లో మిగిలిన 30,000 పైచిలుకు నోటీసుల బట్వాడాను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. లాప్స్ (Lapse) అవుతున్న విచారణ తేదీలపై అధికారులను అప్రమత్తం చేశారు.ఓటర్లు విచారణకు భౌతికంగా హాజరుకాలేని పక్షంలో,వీడియో కాన్ఫరెన్స్ లేదా డిజిటల్ వీడియో కాల్స్ ద్వారా విచారణను పూర్తి చేసి,నిర్ణీత గడువులోగా ప్రక్రియను ముగించాలి.

ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లాగిన్ల ద్వారా దరఖాస్తులను పరిష్కరించేటప్పుడు,కేవలం qవిచారణ ఫారమ్ లేదా సాధారణ ఫోటోలు అప్‌లోడ్ చేస్తే సరిపోదు.కచ్చితంగా బ్యాంక్ పాస్ బుక్,పాస్‌పోర్ట్ లేదా సంబంధిత ధృవీకరణ పత్రాలను పారదర్శకంగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.ఎన్నికల ప్రక్రియ అనేది పూర్తిగా సమయంతో కూడుకున్నది (Time-bound). దీనిలో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం సహించేది లేదని, ప్రతి విచారణకు సంబంధించిన ఫైల్‌ను సక్రమంగా నిర్వహించాలని అధికారులను హెచ్చరించారు.

ఓటర్ల జాబితా రూపకల్పనలో ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా,అధికారులు నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి,జిల్లా రెవెన్యూ అధికారి వి సుబ్బారావు జిల్లా పరిపాలన అధికారిణి కె. నాగలక్ష్మి,రామచంద్రపురం,మమ్మిడివరం,అమలాపురం, రాజోలు,గన్నవరం,కొత్తపేట ఈఆర్వోలు ఎ.సరళావతి, జి.మమ్మీ పి.విజయభాస్కర్, డి.రాంబాబు కె.సురేష్ కుమార్, జి వి సత్యనారాయణ కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story