Amalapuram: అమలాపురంలో స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ కీలక భేటీ

Amalapuram: అమలాపురం జీఎస్ఆర్-2 గార్డెన్స్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై టీడీపీ పరిశీలకులు సానా సతీష్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలతో కీలక సమీక్ష నిర్వహించారు.

PRABHU, RAZOLE
Published on: 19 Oct 2026 6:30 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురంలో స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ కీలక భేటీ

అమలాపురం: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని జీఎస్ఆర్-2 గార్డెన్స్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయి నేతలతో ఎన్నికల పరిశీలకులు సానా సతీష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీ నేతలతో చర్చించారు.

ఈ సమావేశంలో అమలాపురం పార్లమెంట్ సభ్యుడు గంటి హరీష్ బాలయోగి, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య, పి.గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జి మోకా ఆనందసాగర్ తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE