Amalapuram: 14వ రోజుకు చేరిన వీఆర్ఏల సహాయ నిరాకరణ సమ్మె

Amalapuram: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వీఆర్ఏల సహాయ నిరాకరణ సమ్మె 14వ రోజుకు చేరింది. అమలాపురంలో భారీ ర్యాలీ చేపట్టారు.

PRABHU, RAZOLE
Published on: 29 Sept 2026 7:35 PM IST
Amalapuram
X

Amalapuram: 14వ రోజుకు చేరిన వీఆర్ఏల సహాయ నిరాకరణ సమ్మె

అమలాపురం: ఏపీ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) తమ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన వీఆర్ఏలు పెద్ద సంఖ్యలో అమలాపురం నల్లవంతెన మిరియం స్కూల్ దిగువ ప్రాంతంలో ఒకచోట చేరారు.

అక్కడి నుంచి వీఆర్ఏలు భారీ ర్యాలీగా బయలుదేరి అమలాపురం డివిజన్ ఆర్డీఓ కార్యాలయం వరకు చేరుకున్నారు. అనంతరం వీఆర్ఏల సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ కార్యాలయ ఏఓకు అందజేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వారు కోరారు.

వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు:

1. వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేయాలి.

2. అర్హత కలిగిన వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలి.

3. నామినీ వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలి.

జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన వీఆర్ఏలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం నినాదాలు చేశారు. అనంతరం తమ డిమాండ్ల సాధనలో భాగంగా మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద సహాయ నిరాకరణ ఉద్యమాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నట్లు వీఆర్ఏలు తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE